Leading News Portal in Telugu

aghori nagasadhu in police custody 144 section in macherial near villages


Aghori news: తెలంగాణలో హాట్ టాపిక్ గా అఘోరీ ఇష్యూ.. పోలీసుల అదుపులో నాగసాధు

Aghori news: తెలంగాణలో లేడీ అఘోరీ నాగసాధు అంశం హాట్ టాపిక్ గా మారింది. అక్టోబర్ 29న నాగసాధు ఓ పెద్ద ప్రకటన చేశారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఆత్మార్పణ చేసుకుంటానని చెప్పింది. నవంబర్ 1వ తేదీ శుక్రవారం అంటే ఈ రోజు ఉదయం 9 గంటలకు ముత్యాలమ్మ గుడి దగ్గర ప్రాణాలను అర్పిస్తానని ఆమె ప్రకటించింది. ముత్యాలమ్మ ఆలయంపై దాడి చేస్తున్న వారిని ఎందుకు శిక్షించడం లేదంటూ అఘోరీ ప్రశ్నించింది. ఇటీవల తెలంగాణలో ముత్యాలమ్మ విగ్రహంపై దాడి చేసిన ఘటన నేపథ్యంలో ఒక్కసారిగా తెలంగాణలో ప్రత్యక్షమైన అఘోరీ అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఆపై నవంబర్ 1వ తేదీన ఆత్మార్పణ చేసుకుంటానని సంచలన ప్రకటన చేశారు. దీంతో పోలీసులు అఘోరీ నాగసాధును అరెస్ట్ చేశారు. అఘోరీ ని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

అఘోరీ హైదరాబాద్న నగరానికి వెళ్తుండగా.. రాత్రి ఆమెను సిద్ధి పేట ప్రాంతం సమీపంలో మంచిర్యాల పోలీసులు అడ్డుకున్నారు. వారు అఘోరీని తిరిగి తన స్వగ్రామమైనన మంచిర్యాల జిల్లా కుశనపల్లికి తీసుకెళ్లి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. భారీ ఎస్కార్ట్ మధ్య కుశనపల్లిలోని వారి ఇంట్లో హౌస్ అరెస్ట్ చేశారు. ఇక ఇంటి నుండి బయటకు రాకుండా బందోబస్త్ మధ్య నిర్బంధించారు. అఘోరీ అరెస్ట్ నేపధ్యంలో మంచిర్యాల పరిసర గ్రామాల్లో 144సెక్షన్ విధించినట్లు పోలీసులు ప్రకటించారు. కాగా ఇటీవల కేదార్ నాథ్ వెళ్లిన అఘోరీ పని మీద వెళ్తున్నానని, తిరిగి తెలంగాణాకు వచ్చాక విధ్వసం సృష్టిస్తానంటూ హెచ్చరించారు. తన గురించి తప్పుడు కథనాలు వేసిన యూ ట్యూబ్ చానళ్ల అంతు చూస్తానని కూడా పేర్కొన్నారు. పలు యూ ట్యూబ్ చానళ్లపై పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. ఇక ఇదే క్రమంలో మళ్లీ తెలంగాణాకు వచ్చిన లేడీ అఘోరీ తెలంగాణాలోని కొండగట్టు ఆలయంలో స్వామివారికి నిన్న ప్రత్యేక పూజలు చేశారు. ఇక వేములవాడ, కొమురవెల్లి ఆలయాలను కూడా సందర్శించనున్నట్లు ప్రకటించారు. ఇక ఇదే సమయంలో రేపు ముత్యాలమ్మ ఆలయం వద్ద ఆత్మార్పణ చేస్తానని ఆమె గతంలో చేసిన ప్రకటన నేపథ్యంలో పోలీసులు ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు.