Leading News Portal in Telugu

Bandi Sanjay Critiques Revanth Reddy and KTR Over Political Strategies


  • రేవంత్.. కేటీఆర్ మీరు ఇద్దరూ చేయాల్సింది పాదయాత్ర కాదు
  • మోకాళ్ల యాత్ర చేయండి
  • 6 గ్యారంటీలపై రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసే దమ్ముందా?
  • గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిన తప్పులను ఒప్పుకునే దమ్ముందా? : బండి సంజయ్‌
Bandi Sanjay : కాంగ్రెస్‌వన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలే

Bandi Sanjay : రేవంత్, కేటీఆర్ మీరు ఇద్దరూ చేయాల్సింది పాదయాత్ర కాదు… మోకాళ్ల యాత్ర చేయండన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. ఇవాళ ఆయన కరీంనగర్ జిల్లా బెజ్జంకిలో మీడియాతో మాట్లాడుతూ.. 6 గ్యారంటీలపై రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసే దమ్ముందా? గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిన తప్పులను ఒప్పుకునే దమ్ముందా? అని ఆయన ప్రశ్నించారు. మోడీపై కాంగ్రెస్ యుద్దం దేనికోసం? పేదల అభ్యున్నతికి రాత్రింబవళ్లు కష్టపడుతున్నందుకా? అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ వన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలే అని ఆయన సెటైర్లు గుప్పించారు. దీపావళి దాటినా రాజకీయ బాంబులు పేల్చలేదేం? కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే అని బండి సంజయ్‌ విమర్శలు గుప్పించారు.

India vs New Zealand: తిప్పేసిన స్పిన్నర్లు.. న్యూజిలాండ్ 235 ఆలౌట్

హిందువులపై ట్రంప్ కు ఉన్న శ్రద్ధ కాంగ్రెస్ కు లేదా? అని, హిందువులపై దాడులు జరుగుతుంటే నోరెందుకు మెదపరు? అని ఆయన అన్నారు. హిందువుల ఓట్లు మీకు అక్కర్లేదని చెప్పే దమ్ముందా? అని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందే రాజకీయాలు.. ఆ తరువాత అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నా అని ఆయన అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో అందరితో కలిసి పనిచేసేందుకు యత్నిస్తున్నా అని, గత ప్రభుత్వం ఎంత మూర్ఖంగా ఆలోచించిందో తెలిసిందేనన్నారు. అభివృద్ధి విషయంలో మేం సహకరిస్తామని చెప్పినా చేయలేదన్నారు బండి సంజయ్‌

Delhi: ఢిల్లీలో దారుణం.. దీపావళి సంబరాల్లో కాల్పులు.. ఇద్దరి హత్య