Leading News Portal in Telugu

Raghunandan Rao’s Sharp Critique of KTR: Political Comments and Controversies



  • బంద్ చెయ్యి ఎవరు వద్దు అనలేదు.. అమెరికా వెళ్లి బాత్ రూంలు కడుక్కో
  • అధికారంలో ఉన్న పదేళ్లు కేటీఆర్ ప్రజలను కలిసే సమయం దొరకలేదు
  • మీ నాన్న 10 నెలలుగా ఫామ్ హౌస్ లో ఉన్నారు..ఏమైనా నష్టం జరిగిందా :ఎంపీ రఘునందన్‌ రావు
Raghunandan Rao : మీకు పది నెలల పాలనే విసుగొస్తే పదేళ్లు మిమ్మల్ని ఎలా భరించారు

Raghunandan Rao : మాజీ మంత్రి కేటీఆర్ పై మెదక్ ఎంపీ రఘునందన్ రావు సెటైర్లు వేశారు. కేటీఆర్ రాజకీయాలు బంద్ చేయాలని ఉంది అన్నాడని, బంద్ చెయ్యి ఎవరు వద్దు అనలేదు…అమెరికా వెళ్లిపో అంటూ రఘునందన్‌ రావు వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న పదేళ్లు కేటీఆర్ ప్రజలను కలిసే సమయం దొరకలేదని, మీ నాన్న 10 నెలలుగా ఫామ్ హౌస్ లో ఉన్నారు..ఏమైనా నష్టం జరిగిందా అని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ వచ్చింది ప్రజల కోసం కాదు ఆయన వచ్చింది డబ్బుల కోసం, అధికారం కోసం, ఫామ్ హౌస్ కోసమని, మీకు పది నెలల పాలనే విసుగొస్తే పదేళ్లు మిమ్మల్ని ఎలా భరించారని, కేటీఆర్ మోకాళ్ళ యాత్ర చేసిన ప్రజలు విశ్వసించరని రఘునందన్‌ రావు అన్నారు. కేటీఆర్ కు తన నాన్న, చెల్లె, బావతో పాటు ఎవరిపై నమ్మకం లేదని, ఫామ్ హౌస్ కేసులో పాలేవో.. నీళ్ళేవో తెలాలంటే సీసీ ఫుటేజ్ బయట పెట్టాల్సిందే అని రఘునందన్‌ రావు అన్నారు. తెలంగాణలో ఆడవాళ్లు తాగుతారని కోరుట్ల ఎమ్మెల్యే అంటున్నారని, తెలంగాణలో ఎక్కడైనా ఆడవాళ్లు తాగుతారా అని ఆయన వ్యాఖ్యానించారు. దీపావళికి బజార్లలో బాంబులు పేలాయి కానీ పొంగులేటి చెప్పిన కుక్క తోక పటాకులు కూడా పేలలేదని ఆయన అన్నారు.

Priyanka Gandhi: రెండో దశ ఎన్నికల ప్రచారాన్ని షురూ చేయనున్న ప్రియాంక గాంధీ