Leading News Portal in Telugu

A young man trapped a young woman in the name of love for money


  • నగరంలోని ఎంఎల్ఏ కాలనీలో వైష్ణవి కుటుంబం నివాసం..

  • నాగారం ప్రాంతానికి చెందిన ఉమాపతి అనే యువకుడు వైష్ణవికి పరిచయం..

  • డబ్బుల కోసం ప్రేమ పేరుతో వల..

  • ఫోటోలు బయటపెడతా అంటూ వైష్ణవితో రహస్యంగా పెళ్లి..

  • ఉమాపతి వేధింపులకు విసిగిపోయిన వైష్ణవి పోలీసులకు ఫిర్యాదు..
Love Cheating: డబ్బుల కోసం ప్రేమ వల.. రహస్యంగా పెళ్లి.. ఫోటోలతో బ్లాక్ మెయిల్..

Love Cheating: నచ్చావంటే సిగ్గుపడింది. ప్రాణంగా ప్రేమించానంటే పొంగిపోయింది. నా ఊపిరే నువ్వంటే తనతో జీవితాంతం గడపాలనుకుంది. ఇంత ప్రేమగా ప్రేమించేవాడు తన జీవితంలో రాడేమో అనుకుంది. అతడిని పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామని అనుకుంది. కానీ అతను ఆమెను ఆట బొమ్మలా చూసాడు. ప్రేమ పేరుతో మోసం చేశాడు. అవసరం తీరిన తర్వాత అసలు రంగు బయటపెట్టాడు. యువతి ఫోటోలు తీసి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డాడు. మృగాడి వేధింపులు భరించలేక యువతి పోలీసులను ఆశ్రయించిన ఘటన హైదరాబాద్‌ లోని నాగారంలో జరిగింది.

Read also: Lucky Baskar : రెండో రోజు కూడా సాలీడ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘లక్కీ భాస్కర్’

నగరంలోని ఎంఎల్ఏ కాలనీలో వైష్ణవి కుటుంబం నివాసం ఉంటుంది. అయితే నాగారం ప్రాంతానికి చెందిన ఉమాపతి అనే యువకుడు వైష్ణవికి పరిచయమయ్యాడు. డబ్బుల కోసం ప్రేమ పేరుతో వల వేశాడు. అది తెలుసుకోలేని వైష్ణవి, ఉపాపతిని పూర్తీగా నమ్మింది. అతనితో తిరిగింది. చివరకు అతని రంగు బయటపెట్టాడు. తనని పెళ్లిచేసుకోవాలని లేకుంటే.. ఫోటోలు బయటపెడతా అంటూ వైష్ణవితో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడే వుంటే డబ్బులు సంపాదించలేమని వైష్ణవిని నమ్మించి ఆమెతో విదేశాలకు వెళ్లేందుకు డిపెండెంట్ వీసా కోసం మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకున్నాడు. యువతి వెంట యూ.కే వెళ్లాడు ఆమె డబ్బుతో జల్సా చేయడం మొదలుపెట్టాడు.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.1.25 కోట్లు వసూలు చేసి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాడు. అతని ఆగడాలను సహించలేక ఉపాపతిని ప్రశ్నించింది వైష్ణవి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఉపాపతి ఆమెను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశాడు. డబ్బుల కోసం బాధితురాలికి, కుటుంబ సభ్యులకు బెదిరింపులకు పాల్పడ్డాడు. అట్రాసిటీ కేసు పెట్టించి జైలుకి పంపిస్తా అంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. ఉపాపతి ఆగడాలకు విసిగిపోయిన వైష్ణవి చివరకు ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాగారం ప్రాంతానికి చెందిన ఉమాపతి అనే యువకుడిపై బీ ఎన్ ఎస్ 85, 318(4) 316(2) 308(2) తో పాటు 3,4 వరకట్న వేధింపుల నిషేధ చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఉమాపతి కోసం గాలిస్తున్నారు.
EPFO Job Notification: కేవలం ఇంటర్య్వూ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వనున్న ఈపిఎఫ్ఓ