Leading News Portal in Telugu

Deputy CM Bhatti Vikramarka’s visit to Nalgonda district


  • నేడు నల్లగొండ జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన..

  • డిప్యూటీ సీఎం తో పాటు మంత్రులు కోమటిరెడ్డి- ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొననున్నారు.
Bhatti Vikramarka: నేడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన వివరాలు..

Bhatti Vikramarka: నేడు నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో వీర్లపాలెం యాదాద్రి ధర్మాలు పవర్ ప్లాంట్ కు రానున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం తో పాటు మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొననున్నారు. ప్లాంట్ లోని యూనిట్ వన్ ట్రయల్ రన్ ప్రారంభించనున్నారు. ప్లాంట్ విద్యుత్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రత్యేక చాపర్ లో మధ్యాహ్నం 1 గంటలకు పవర్ ప్లాంట్ కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు చేరుకోనున్నారు. డిప్యూటీ సీఎం రాక నేపథ్యంలో ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. మంత్రుల రాకతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యాదాద్రి ధర్మాలు పవర్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో దారిని మళ్లించారు. ప్రయాణికులు, వానదారులు వేరే మార్గాల ద్వారా వెళ్లాలని పోలీసులు సూచించారు.

Read also: Bhatti Vikramarka: నేడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన వివరాలు..

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క షెడ్యూల్ ఇలా..

* ఉదయం 10:30 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఈరోజు హనుమకొండ లోని సత్యసాయి గార్డెన్స్ లో జరిగే ఆయిల్ ఫెడ్ చైర్మన్ కుమార్తె నిఖితా రెడ్డి వివాహానికి హాజరవుతారు.
* మధ్యాహ్నం 1:30 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లతో కలిసి యాదాద్రి పవర్ ప్లాంట్ ను సందర్శిస్తారు.
* మధ్యాహ్నం 1:40 గంటలకు యాదాద్రి పవర్ ప్లాంట్ స్టేజి-1 లో ఉత్పత్తి చేసిన విద్యుత్తును గ్రిడ్డుకు అనుసంధానం చేసే కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొంటారు.
* మధ్యాహ్నం 2 గంటలకు యాదాద్రి పవర్ ప్లాంట్ పురోగతి పనులపై మంత్రులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులతో సమీక్షిస్తారు.
* మధ్యాహ్నం 3:10 గంటలకు హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం గడ్డి పల్లి గ్రామంలో ఈరోజు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ భవన నిర్మాణానికి మంత్రులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేస్తారు.
* మధ్యాహ్నం 3:30 గంటలకు హుజూర్ నగర్ లోని హౌసింగ్ కాలనీని మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శిస్తారు. అనంతరం హౌజింగ్ కాలనీ పరిశీలించిన అనంతరం అక్కడ ఉన్న లబ్ధిదారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలుస్తారు.
* సాయంత్రం 4:30 గంటలకు హుజూర్ నగర్ నుంచి మంత్రులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాదు కు ప్రయాణం అవుతారు.
Sabarimala: శబరిమల యాత్రికులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షల ఉచిత బీమా