Leading News Portal in Telugu

Etela Rajender Advocates for Justice at Senior Citizens Meeting in Banjara Nagar


  • ఈయన మా బిడ్డ అని ఇంటింటికీ భావించి నాకు ఓటువేసి గెలిపించారు
  • చెరువులు.. మూసీ ప్రక్షాళనకు నేను వ్యతిరేకం కాదు
  • పేదవారి గొంతుక అయినందుకు గర్వపడుతున్నాను : ఈటల
Etela Rajender : ఏ హోదా ఉన్నా, ఏ పదవి ఉన్నా తృప్తిగా పనిచేస్తా

Etela Rajender : కంటోన్మెంట్ బంజారానగర్ లో జరిగిన సీనియర్ సిటిజన్స్, బీజేపీ క్రియాశీల కార్యకర్తల సమావేశంలో మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. అన్యాయంకి, దుర్మార్గంకి వ్యతిరేకంగా కొట్లాడడమే నా వ్యక్తిత్వమన్నారు. ఏ హోదా ఉన్నా, ఏ పదవి ఉన్నా తృప్తిగా పనిచేస్తా అని, తృప్తిలేనిది, గౌరవం లేనిది ఎంత పెద్ద పదవి అయినా వ్యర్థమని నేను భావిస్తా అని ఆయన వ్యాఖ్యానించారు. ఈయన మా బిడ్డ అని ఇంటింటికీ భావించి నాకు ఓటువేసి గెలిపించారని, చెరువులు, మూసీ ప్రక్షాళనకు నేను వ్యతిరేకం కాదన్నారు ఈటల రాజేందర్.

UP: లంచం డిమాండ్ చేసిన ఇన్‌స్పెక్టర్లు.. వారిని బంధించి చితక బాదిన గ్రామస్థులు (వీడియో)

మూసీ బాగుపడాలని ఆ నీళ్లు నల్లగొండ రైతులకు ఉపయోగపడాలని కోరుకుంటున్నానని, కానీ ఇల్లు కూలగొట్టి రాత్రికి రాత్రి బిచ్చగాళ్లుగా చేసే పనిని వ్యతిరేకించానని ఆయన అన్నారు. పేదల పక్షాన కొట్లాడుతున్నానని, పేదవారి గొంతుక అయినందుకు గర్వపడుతున్నానని ఈటల వ్యాఖ్యానించారు. ప్రతిరోజు నేను ప్రజల మధ్యనే ఉంటానని, పిలిస్తే పలికే వ్యక్తిని ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. ఎక్కడ ఆపద ఉన్న మీ కుటుంబ సభ్యునిలాగా అందుబాటులో ఉంటానని ఈటల రాజేందర్‌ అన్నారు

RK Roja: సూపర్ సిక్స్ కాదు సూపర్ చీటింగ్.. మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు