Leading News Portal in Telugu

Bhatti Vikramarka Reviews Yadadri Thermal Power Plant Progress with Ministers


  • భవిష్యత్తులో విద్యుత్‌కు ఇబ్బంది రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం
  • రాష్ట్రంలో పరిశ్రమ.. వ్యవసాయం.. గృహ అవసరాలకు క్వాలిటీ పవర్‌ను అందిస్తున్నాం
  • రాష్ట్రంలో న్యూ ఎనర్జీ పాలసీని త్వరలోనే తీసుకువస్తాం
Bhatti Vikramarka : భవిష్యత్తులో విద్యుత్‌కు ఇబ్బంది రాకుండా  పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం

Bhatti Vikramarka : యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో 35 వేల కోట్ల రూపాయలతో చేపట్టిన వైటీపీఎస్ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిలు సందర్శించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ కు రామగుండం నుండి సరఫరా అయ్యే బొగ్గు గూడ్స్ వ్యాగిన్ కు జెండా ఊపి మంత్రులు ప్రారంభించారు. ప్లాంట్ ను సందర్శించిన మంత్రులు పవర్ ప్లాంట్ మొదటి యూనిట్ ఆయిల్ సింక్రనైజేషన్ ను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. 2025 మే నాటికి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ను పూర్తి చేసి 4వేల మెగావాట్ల విద్యుత్తును గ్రిడ్డు కు అనుసంధానం చేస్తామని, యాదాద్రి పవర్ ప్లాంట్ స్టేషన్ లోని స్టేజి-1 లో అవుతున్న విద్యుత్ ఉత్పత్తిని గ్రిడ్డు కు అనుసంధానం చేసే కార్యక్రమం ఈరోజు విజయవంతంగా జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్తు డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని 2028-29 నాటికి 22,288  మెగావాట్లు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Huge Discount on SUV: ఈ ఎస్‌యూవీ కారుపై భారీగా డిస్కౌంట్.. ఏకంగా రూ.12 లక్షల తగ్గింపు

2034-35 నాటికి 31,809 విద్యుత్తు డిమాండ్ ను అంచనా వేసి ఉత్పత్తి చేయడానికి ప్రజా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతున్నదని, భవిష్యత్తులో విద్యుత్తు కు ఇబ్బంది రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు భట్టి విక్రమార్క. రాష్ట్రంలో పరిశ్రమ, వ్యవసాయం, గృహ అవసరాలకు క్వాలిటీ పవర్ ను అందిస్తున్నామని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా వాతావరణం కలుషితం కాకుండా 20 వేల  మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో న్యూ ఎనర్జీ పాలసీని త్వరలోనే తీసుకువస్తామని, న్యూ ఎనర్జీ పాలసీని తీసుకురావడంలో మేధావులు విద్యుత్తు నిష్ణాతులతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు భట్టివిక్రమార్క. శాసనసభలో చర్చించి అందరి అభిప్రాయంతో న్యూ ఎనర్జీ పాలసీ తీసుకువస్తామని, రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పడానికి వస్తున్న బహుళజాతి కంపెనీలు కొంత శాతం గ్రీన్ ఎనర్జీని వినియోగం చేస్తాయి. వారి అవసరాలకు అనుగుణంగా గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసి ఇస్తామని ఆయన వెల్లడించారు. ఎనర్జీ విషయంలో దేశంలోనే తెలంగాణను తలమాణికంగా, మోడల్‌గా నిలుపుతామన్నారు.

Huge Discount on SUV: ఈ ఎస్‌యూవీ కారుపై భారీగా డిస్కౌంట్.. ఏకంగా రూ.12 లక్షల తగ్గింపు