Leading News Portal in Telugu

Minister Tummala Nageswara Rao Discusses Development in Illandu Constituency


  • ఏ ప్రభుత్వంలో ఉన్నా ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి పాటుపడ్డా
  • రేవంత్ రెడ్డి పాలనలో ఇచ్చిన వాగ్దానాలు అన్ని అమలు చేస్తాం
  • దేశం లో ఎక్కడా లేని విధంగా 18 వేలు కోట్లు రుణమాఫీ చేశాం : మంత్రి తుమ్మల
Tummala Nageswara Rao : దేశంలో ఎక్కడా లేని విధంగా 18 వేలు కోట్లు రుణమాఫీ చేశాం

Tummala Nageswara Rao : గత నలభై ఏళ్లుగా ఇల్లందు నియోజక వర్గంతో నాకు అనుబంధం ఉందని, ఆదివాసీలు గిరిజనులు ఎక్కువగా ఉన్న భద్రాచలం పినపాక ఇల్లందు నియోజక వర్గాల్లో ఎక్కువ సమయం కేటాయించా అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. ఇవాళ ఆయన భద్రాద్రి కొత్తగూడెంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎర్ర బస్సు కరెంట్ బల్బు చూడని గుండాల ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు తో ప్రగతి బాట పట్టించానన్నారు. ఏ ప్రభుత్వంలో ఉన్నా ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి పాటుపడ్డా అని ఆయన వ్యాఖ్యానించారు.

IND vs NZ: టీమిండియా పరాజయం.. కోహ్లీపై విపరీతమైన ట్రోల్స్

అంతేకాకుండా.. రేవంత్ రెడ్డి పాలనలో ఇచ్చిన వాగ్దానాలు అన్ని అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. దేశం లో ఎక్కడా లేని విధంగా 18 వేలు కోట్లు రుణమాఫీ చేశామని ఆయన తెలిపారు. రెండు లక్షల పైన రుణమాఫీ ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తామని, భద్రాచలం శ్రీ రామచంద్రుడు సాక్షిగా రేవంత్ రెడ్డి ఇచ్చిన రుణమాఫీ వాగ్దానం నెరవేర్చామని మంత్రి తుమ్మల అన్నారు. అధిక వర్షాలు వల్ల పత్తి దిగుబడులు తగ్గాయి గిట్టుబాటు వచ్చేలా సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోళ్లు, ఆయిల్ పామ్ సాగు తో రైతులకు లాభాలు, పత్తి సాగుతో నష్టపోకుండా ఆయిల్ పామ్ సాగు ఇల్లందు నియోజక వర్గంలో చేపట్టాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.

K.Laxman : పెంచిన రైతు భరోసా కాదుకదా ఉన్న రైతుబంధును ఎగ్గొట్టింది రేవంత్ ప్రభుత్వం