Leading News Portal in Telugu

Ponnam Prabhakar Questions Kishan Reddy on Contributions to Telangana


  • తెలంగాణ ఏర్పాటును పార్లమెంట్ సాక్షిగా ప్రశ్నించిన మోడీ వ్యాఖ్యలు తప్పు కదా
  • కేసీఆర్ సలహా మేరకు.. కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు అయ్యారు
  • ఆయన మమ్మల్ని తిడితే అశ్చర్యపోవాల్సిన ఏముంది
  • మోడీ వ్యాఖ్యలు ఖండించకపోతే తెలంగాణ బిడ్డలు కారు మీరు : మంత్రి పొన్నం
Ponnam Prabhakar : తెలంగాణ ప్రయోజనాల కోసం కిషన్ రెడ్డి టూరిజం నుండి ఏం తెచ్చావు

Ponnam Prabhakar : కిషన్ రెడ్డి తెలంగాణ కి ఏం ఇచ్చారో చెప్పండని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మీడియాతో చిట్‌ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రయోజనాల కోసం కిషన్ రెడ్డి టూరిజం నుండి ఏం తెచ్చావు చూపించాలన్నారు. కిషన్ రెడ్డి ది నిజంగా తెలంగాణ డీఎన్ఏ ఐతే.. మోడీ వ్యాఖ్యలు ఖండించాలని, తెలంగాణ ఏర్పాటును పార్లమెంట్ సాక్షిగా ప్రశ్నించిన మోడీ వ్యాఖ్యలు తప్పు కదా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ సలహా మేరకు.. కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు అయ్యారని, ఆయన మమ్మల్ని తిడితే అశ్చర్యపోవాల్సిన ఏముందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. మోడీ వ్యాఖ్యలు ఖండించక పోతే తెలంగాణ బిడ్డలు కారు మీరు అని మండిపడ్డారాయన. వంద ఎలుకలు తిన్న పిల్లి మాదిరి బీఆర్‌స్ నేతలు రాష్ట్రంలో సర్పంచులు గురించి మాట్లాడ్తున్నారని, బీఆర్‌స్ టైం లో సర్పంచుల ఆత్మహత్యలకు కారణం అయినవారే మద్దతుగా ధర్నా లు చేస్తున్నారని మంత్రి పొన్నం మండిపడ్డారు.

World War 3 : జ్యోతిష్యం నిజమవుతుందా..? మూడో ప్రపంచ యుద్ధమేనా..!?

సర్పంచుల బకాయిలకు ప్రభుత్వం గ్యారెంటీ… పొలిటికల్ పార్టీల ట్రాప్ లో పడకండని, రాష్ట్రం లో సర్పంచులు ఆందోళన చెందాల్సిన అవసరమా లేదన్నారు. సర్పంచులను మా ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికి తెలుసు ఓపిక పట్టండి మార్చ్ నెలాఖరు లోగా బకాయిలు చెల్లిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం పది ఏండ్ల నుండి చేసింది ఏంటో కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పాలని, అమర వీరుల స్థూపం దగ్గర చర్చకు రావాలన్నారు. వరద నష్టం నివేదిక కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ కు నివేదించామన్నారు. పది వేల కోట్ల నష్టానికి 400 వందల కోట్లు ఇచ్చారని, మూసీ పరివాహక ప్రాంతాలను బిఅరెస్ రెచ్చకొట్టే కార్యక్రమం ముగిశాక న్యాయం చేయడానికి మేము వెళతామన్నారు.

Minister Narayana: అమరావతి పనులకు కొత్త టెండర్లు పిలవడానికి లైన్ క్లియర్