Leading News Portal in Telugu

Ponguleti Srinivas Reddy Launches Indiramma Housing Initiative for the Poor


  • ఇందిరమ్మ ఇళ్ల కోసం యాప్ ను తయారు చేశాం
  • యాప్ ద్వారా ఇళ్ళ నిర్మాణం ఎలా జరుగుతుందో పరిశీలిస్తాం
  • గ్రామ సభలు పెట్టి మంత్రుల ద్వారా ఇళ్లను అప్రూవ్ చేస్తారు : మంత్రి పొంగులేటి
Ponguleti Srinivas Reddy : ఇందిరమ్మ ఇళ్ల కోసం యాప్‌.. అర్హులైన వారు ఏ పార్టీలో ఉన్నా ఇళ్లు ఇస్తాం

Ponguleti Srinivas Reddy : పార్టీలకు, కులాలకు అతీతంగా గ్రామ సభలు పెట్టి అర్హులైన పేదలకు ఇళ్లు నిర్మించే కార్యక్రమం చేపట్టామన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవాళ ఆయన ఖమ్మం రూరల్ మండలం దానావాయిగూడెంలో మాట్లాడుతూ.. మరో రెండు రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ళ ప్రక్రియ మొదలవుతుందని, ఇందిరమ్మ ఇళ్ల కోసం యాప్ ను తయారు చేశామన్నారు. యాప్ ద్వారా ఇళ్ళ నిర్మాణం ఎలా జరుగుతుందో పరిశీలిస్తామని, కేంద్ర ప్రభుత్వం ఇళ్ళ నిర్మాణం కోసం రూరల్ లో 71 వేలు అర్బన్ లో లక్షా యాబై వేలు ఇస్తుందన్నారు మంత్రి పొంగులేటి. మిగిలిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం భరించి పేదవారి చిరకాల స్వప్నం నెరవేరుస్తుందని, గత BRS ప్రభుత్వం లో పింక్ కలచొక్కా వేసుకున్న వాళ్ళకే స్కీం లు ఇచ్చారన్నారు.

Supreme Court: నిషేధం ఉన్నప్పటికీ పటాకులు ఎలా కాల్చారు.. ఢిల్లీ ప్రభుత్వానికి కోర్టు చివాట్లు

వాళ్ళు ఇంకా అదే భ్రమలో ఉన్నారని, గ్రామ సభలు పెట్టి మంత్రుల ద్వారా ఇళ్లను అప్రూవ్ చేస్తారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. ఈ ప్రభుత్వానికి పేదవారికి అండగా ఉండాలనే ఆలోచన ఉందని, అర్హులైన వారు ఏ పార్టీలో ఉన్నా ఇళ్లు ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఒక లక్షా యాబై వేల డబుల్ బెడ్ రూం ఇళ్ళు కట్టామని చెప్పారని, కేవలం 91 వేల ఇళ్లు మాత్రమే కట్టి అందులో మౌలిక వసతులు కల్పించలేదన్నారు. రాష్ట్రంలో 63 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు వివిధ దశల్లో నిలిచిపోయాయని, వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి.

Rakul : 500 నోటు కాల్పించబోయాడు..షాకింగ్ విషయం చెప్పిన స్టార్ హీరోయిన్