Leading News Portal in Telugu

CM Revanth Reddy Issues Guidelines for Smooth Rice Procurement in Telangana


  • ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి
  • ప్రభుత్వ పథకాలు.. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు జిల్లాకో ప్రత్యేక అధికారి
  • రైతులకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని జిల్లాల్లో కొనుగోళ్లు చేపట్టాలని : రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు ప్రతి ఉమ్మడి జిల్లాకో ప్రత్యేక అధికారి..

CM Revanth Reddy : రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉమ్మడి జిల్లాకో ఐఏఎస్‌ ను ప్రత్యేక అధికారి గా నియమించింది. రైతులకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని జిల్లాల్లో కొనుగోళ్లు చేపట్టాలని, ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించి, ఏమైనా సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు.

PM Modi: 3 లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని మోడీ హామీ..

ప్రత్యేకాధికారులు :

ఆదిలాబాద్, నిర్మల్​, కుమ్రంభీం అసిఫాబాద్​, మంచిర్యాల జిల్లాలకు కృష్ణ ఆదిత్య,

* కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లా జిల్లాలకు ఆర్​వీ కర్ణన్​,

* నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేటకు అనితా రామచంద్రన్

* నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు డా. ఏ.శరత్

* రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లాలకు డి.దివ్య,

* మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ , నాగర్‌కర్నూల్ జిల్లాలకు రవి,

* వరంగల్, హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు టి.వినయ కృష్ణ రెడ్డి

* మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు హరిచందన దాసరి

* ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు కె.సురేంద్ర మోహన్

Jabardasth: వేణుమాధవ్‌తో ఉన్న ఈ కుర్రాడు ఎవరో గుర్తు పట్టారా? ఇప్పుడు జబర్దస్త్ స్టార్ కమెడియన్!