Leading News Portal in Telugu

Union Minister Bandi Sanjay Kumar Criticizes Rahul Gandhi’s visit to Telangana


  • ఆరు గ్యారంటీల అమలుపై రాహుల్ గాంధీ మాట్లాడిన తర్వాత రాష్ట్రంలో పర్యటించాలి..

  • మూసి సుందరీకరణకు వ్యతిరేకంగా కాదు.. రూ. 1 లక్ష 50 కోట్లతో చేస్తామనేదానికి వ్యతిరేకం..

  • మూసి సుందరీకరణలో పేదలకు నష్టం కలిగిస్తామంటే సహించం: కేంద్రమంత్రి బండి సంజయ్
Bandi Sanjay: ఆరు గ్యారంటీల అమలుపై రాహుల్ గాంధీ మాట్లాడిన తర్వాతే రాష్ట్రంలో పర్యటించాలి

Bandi Sanjay: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండల కేంద్రంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా వెజిటేబుల్ మార్కెట్ సౌచాలయాలకు భూమి పూజ సీసీ రోడ్లు నిర్మాణాన్ని ప్రారంభించారు. అలాగే, లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఇక, బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై మాట్లాడిన అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించాలని డిమాండ్ చేశారు. అలాగే, మూసి సుందరీకరణకు మేం వ్యతిరేకం కాదు.. 15 వేల కోట్ల అంచనాలతో పూర్తయ్యే మూసీ నది సుందరీకరణను రూ. 1,50,000 కోట్లతో చేస్తామనడానికి వ్యతిరేకం చెప్పుకొచ్చారు.

ఇక, మూసి సుందరీకరణలో పేదలకు నష్టం కలిగిస్తామంటే సహించం అని బండి సంజయ్ తెలిపారు. మూసి ప్రాజెక్టు టెండర్లను కాంగ్రెస్ హై కమాండ్ అల్లుడికి కట్ట పెట్టాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. హైడ్రా నుంచి ప్రజల దృష్టి మరలించడానికి మూసి అభివృద్ధి నాటకం ఆడుతుంది.. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను అమలు చేయని కాంగ్రెస్ మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రకటనలు ఇస్తుంది.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల సొమ్మును పంజాబ్లో రైతులకు పంచినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ హై కమాండ్ కు కప్పం కడుతూ మహారాష్ట్రలో పేపర్ ప్రకటనలు ఇస్తుందని ఆరోపించారు. సర్పంచ్ పెండింగ్ బిల్లుల సమస్యలపై మొదట స్పందించింది బీజేపీ పార్టీ.. సర్పంచుల సమస్యలకు కారణమైన బీఆర్ఎస్ ఏ రకంగా పోరాడుతుంది అని ప్రశ్నించారు. హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్న ఒక వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ కమ్యూనిస్టులు మాట్లాడడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు.