Leading News Portal in Telugu

HYDRA focus on Land Alienation in Miyapur..


  • మియాపూర్ లో భూముల అన్యాక్రాంతంపై హైడ్రా నజర్..

  • విచారణ కోసం రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు..

  • భూమి ఆక్రమణ పైనే దృష్టి సారించినట్లు తెలిపిన హైడ్రా అధికారులు..
HYDRA: మియాపూర్లో భూముల అన్యాక్రాంతంపై హైడ్రా దృష్టి..

HYDRA: గ్రేటర్ హైదరాబాద్‌ లోని అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. గ్రేటర్ పరిధిలోని చెరువుల, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, నాలాలను కబ్జా చేసి నిర్మించి అక్రమ కట్టడాలను కూల్చేస్తుంది. గత మూడు నెలల్లోనే వందల నిర్మాణాలను నెలమట్టం చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు ఏమాత్రం ఆస్కారం లేకుండా సైలెంట్‌గా పని చేసుకుంటూపోతుంది. మియాపూర్ లోని సర్వే నెంబర్ 100, 101లో గల భూముల అన్యాక్రాంతంపై హైడ్రా అధికారులు దృష్టి పెట్టారు.

ఇక, మియాపూర్ లో భూముల అన్యాక్రాంతంపై విచారణ చేసేందుకు రంగంలోకి ప్రత్యేక బృందం దిగింది. భూముల వాస్తవ విస్తీర్ణం, ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమి సుమారు 15 ఏళ్లుగా జరిగిన రిజిస్ట్రేషన్ లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయం నుంచి వివరాలను అధికారులు సేకరించారు. త్వరలో చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. అక్రమ రిజిస్ట్రేషన్లు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమి ఆక్రమణ పైనే ప్రధాన దృష్టి సారించినట్లు హైడ్రా అధికారులు తెలిపారు.