- తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు ఇవే
- రేపటి నుంచి నవంబర్ 26వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం

TG Inter Exam Fee: తెలంగాణలోని జూనియర్ జాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రేపటి(నవంబర్ 6) నుంచి నవంబర్ 26వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు అవకాశాన్ని కల్పించింది. రూ.100 ఆలస్య రుసుముతో డిసెంబర్ 4 వరకు అవకాశాన్ని కల్పించారు. రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 11 వరకు ఫీజు చెల్లించాలని అధికారులు తెలిపారు. రూ.2 వేల ఆలస్యం రుసుముతో డిసెంబర్ 27 వరకు బోర్డు అవకాశం కల్పించింది.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ జనరల్, సెకండ్ ఇయర్ జనరల్ ఆర్ట్స్ వారు రూ. 520 ఫీజును చెల్లించాలని అధికారులు తెలిపారు సెకండ్ ఇయర్ జనరల్ సైన్స్ విద్యార్థులు రూ.750 ఫీజును చెల్లించాలని వెల్లడించారు. మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ కోర్సులకు పరీక్ష ఫీజు రూ.750 చెల్లించాల్సి ఉంటుంది.