-
బ్యాంకర్లు హైడ్రా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న డిప్యూటీ సీఎం - హైడ్రా భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వదని స్పష్టం
- స్వయం సహాయక సంఘాలకు గుడ్‌న్యూస్
- ఈ ఏడాది 20వేల కోట్ల వడ్డీ లేని రుణాలు
- ప్రజా భవన్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక బ్యాంకర్ల సమావేశంలో భట్టి వ్యాఖ్యలు
బ్యాంకర్లు హైడ్రా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. హైడ్రా భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. బుధవారం ప్రజా భవన్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ, టౌన్ ప్లానింగ్ వంటి ప్రభుత్వ విభాగాలు అన్ని అంశాలు పరిశీలించి నిర్మాణాలకు అనుమతులు ఇస్తాయని, ఏ ప్రభుత్వమైనా వీటిని కొనసాగిస్తాయని వివరించారు. హైడ్రా సెక్యూరిటీ, ట్రాఫిక్ నియంత్రణ, అక్రమార్కులు పార్కులు, సరస్సులు ఆక్రమించుకోకుండా చూస్తుందని తెలిపారు. ప్రభుత్వంలోని కొన్ని శాఖలకు బ్యాంకింగ్ రంగం ద్వారా చేయూతను అందించాలని ఉద్దేశంతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. కుటుంబాలకు ఆర్థికంగా చేయూతను ఇవ్వాలనేదే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వెనుక ఉన్న ఉద్దేశమన్నారు.
READ MORE: Bangalore: రోడ్డుపై వ్లాగ్ చేస్తున్న యువతి.. ఆమెను అక్కడ టచ్ చేసిన పదేళ్ల బాలుడు(వీడియో)
స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది 20వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలన్నారు భట్టి విక్రమార్క.. “కార్పొరేట్ కమర్షియల్ బ్యాంకులు తొమ్మిది నుంచి.. 13 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. బ్యాంకర్లు సామాజిక బాధ్యతతో పనిచేయాలి. రుణాలు ఇచ్చే ముందు ఉన్న నిబంధనలు సరళ తరం చేయాలి. ప్రైవేటు విభాగాల్లో బ్యాంకర్లు ఇచ్చిన రుణాల రికవరీ శాతం తక్కువగా ఉంటుంది. అదే స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇచ్చిన రుణాల రికవరీ శాతం చూస్తే 98 శాతానికి పైగా ఉంది. హైదరాబాదులో 3000 కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇవ్వాలని నిర్ణయించాం. వాటిని ఐదు వేల కోట్లకు తీసుకువెళ్లాలి. అని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు.
READ MORE:US-Iran: ట్రంప్ విజయంతో ఆల్‌టైమ్ కనిష్టస్థాయికి పడిపోయిన ఇరాన్ కరెన్సీ