Leading News Portal in Telugu

Minister Ponnam Prabhakar launched a comprehensive family survey from today


  • రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి సమగ్ర కుటుంబ సర్వేను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్..

  • అందరి సలహా సూచనలు తీసుకున్న తర్వాతనే సర్వే ప్రశ్నలు తయారు..

  • ఎలాంటి పత్రాల జిరాక్సులు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం
Ponnam Prabhakar: ఆధార్ కార్డు వివరాలు ఆప్షనల్ మాత్రమే.. సమగ్ర కుటుంబ సర్వేను ప్రారంభించిన మంత్రి

Ponnam Prabhakar: రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు నుంచి సమగ్ర కుటుంబ సర్వేను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈకార్యక్రమానికి మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, GHMC అధికారులు పాల్గొన్నారు. ఎన్యుమరేటర్లకు సర్వే కిట్ అందజేశారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు నుంచి సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుందని తెలిపారు. 150 ఇండ్లకు ఒక ఎన్యుమరెటర్ సర్వే వివరాలు తీసుకుంటున్నారని అన్నారు. మొదటి మూడు రోజులు ఇండ్లకు స్టిక్కెర్ అంటిస్తారని వివరించారు. ఆ తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇళ్లకు వివరాలు సేకరిస్తారని వెల్లడించారు. ఈ సర్వే కు పబ్లిక్ సహకరించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 17 లక్షల 44 వేల ఇళ్లు ఉన్నాయని తెలిపారు.

Read also: US Election 2024: స్వింగ్ స్టేట్స్ లో ఆధిపత్యం కనపరుస్తున్న డోనాల్డ్ ట్రంప్

సర్వే కోసం 87 వేల 900 ఎన్యుమరెటర్లు నియమించామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 28 లక్షల ఇండ్లు ఉండగా 19 వేలకు పైగా ఎన్యుమరేటర్లు నియమించామన్నారు. ఈ సర్వే ద్వారా వచ్చే డేటా తో అన్ని వర్గాల వారికి భవిష్యత్ లో న్యాయం జరిగేలా చేస్తామన్నారు. కొందరు ఈ సర్వేను రాజకీయం చేయాలని చూస్తున్నారని తెలిపారు. వారి మాటలు ప్రజలు నమ్మొద్దని సూచించారు. సర్వేలో ఏమైనా సమస్యలు ఉంటే ప్రతిపక్షాలు నన్ను అడగండాలని తెలిపారు. ప్రజల సహకారం ఉంటేనే సర్వే సక్సెస్ అవుతుందన్నారు. అందరి సలహా సూచనలు తీసుకున్న తర్వాతనే సర్వే ప్రశ్నలు తయారు చేశామన్నారు. ఆధార్ కార్డు వివరాలు ఆప్షనల్ మాత్రమే.. ఎలాంటి పత్రాల జిరాక్సులు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
Elon Musk: అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్‌ ముందంజ.. ఎలాన్ మస్క్‌ పోస్ట్‌