Leading News Portal in Telugu

Groom Goes Missing One Day Before Marriage In Hyderabad


  • పెళ్లికి ముందు రోజు అదృశ్యమైన పెళ్లి కొడుకు

  • ప్రేమ వివాహంకు అంగీకరించి రేపు పెళ్లికి సిద్ధం చేసిన ఇరు కుటుంబాలు

  • ఈరోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా పోవడంతో పోలీస్ స్టేషన్ల ఫిర్యాదు చేసిన వధువు

  • గాయత్రి గార్డెన్లో నిలిచిపోయిన పెళ్లి.
Groom Missing: పెళ్లికి ముందు రోజు పెళ్లి కొడుకు అదృశ్యం..

సికింద్రాబాద్‌లో ఓ పెళ్లి వేడుక అర్ధాంతరంగా ఆగిపోయింది. పెళ్లికి ముందు రోజు పెళ్లి కొడుకు అదృశ్యమవడంతో ఈ ఘటన సంచలనంగా మారింది. ప్రేమ వివాహంకు అంగీకరించిన పెద్దలు.. రేపు పెళ్లికి సిద్ధం చేసిన ఇరు కుటుంబ సభ్యులు. అయితే.. పెళ్లి కొడుకు పత్తా లేకుండా పోవడంతో రేపు జరగాల్సిన పెళ్లి నిలిచిపోయింది. సికింద్రాబాద్ లోని మారేడుపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈరోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా పోవడంతో వధువు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

మారేడుపల్లికి చెందిన యువతి.. అల్వాల్ కు చెందిన యువకుడు సందీప్ రమేశ్ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గత కొన్నేళ్లుగా యువతీ యువకులు ప్రేమించుకుంటున్నారు. దీంతో.. ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించారు. ఈ క్రమంలో.. గాయత్రి గార్డెన్ లో పెళ్లి జరిపేందుకు సిద్ధమయ్యారు. కాగా.. ఆగష్టులో ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. రూ. 10 లక్షల వరకు ఖర్చు చేసి కట్నంతో పాటు పలు సామాగ్రిని అందించారు. అయితే రేపు వివాహం జరగాల్సి ఉండగా.. పెళ్లి కుమారుడు అదృశ్యమయ్యాడు. ఆందోళనకు గురైన వధువు కుటుంబ సభ్యులు యువకుడు కుటుంబ సభ్యులను సంప్రదించారు.