Leading News Portal in Telugu

Komatireddy Venkatareddy Criticizes KTR and BRS | No Change in CM Post in Telangana


  • కేటీఆర్‌ పాదయాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మరు
  • పదేళ్లలో మూసీని శుభ్రం చేయని బతుకు.. బతుకేనా..?
  • ఐదేళ్లు సీఎంగా రేవంత్‌రెడ్డే ఉంటారు
  • నాలుగేళ్ల తర్వాత ఎన్నికలు వస్తాయి.. మళ్లీ రేవంత్‌ సీఎం అవుతారు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
Komatireddy Venkat Reddy : పదేళ్లలో మూసీ శుభ్రం చేయని బతుకు.. ఓ బతుకా

Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్, కేటీఆర్‌పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికాలో చదువుకున్న కేటీఆర్‌కు కనీసం బుద్ధి కూడా లేదని వ్యాఖ్యానించారు. కవితకు బెయిల్ వస్తుందని తెలిసి, ఆమెకు జామీన్ వచ్చే రోజు రెండ్రోజులు ముందే ఢిల్లీ వెళ్లిపోయారని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకే మాట అనేవి అన్నాడు, తప్పు చేసినప్పుడు పెద్ద పెద్ద నాయకులే జైలుకెళ్లిపోతే కేటీఆర్ ను ఎవరూ అడ్డుకుంటారని ప్రశ్నించారు.

Uddhav Thackeray: యోగి వ్యాఖ్యలపై అజిత్ పవార్ అభ్యంతరం.. బీజేపీ కూటమిలో ఐక్యత లేదు..

తెలంగాణలో సీఎం పదవిలో మార్పు ఉంటుందని వస్తున్న అంచనాలపై, కోమటిరెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సీఎం పదవిలో మార్పు లేదు అని స్పష్టం చేస్తూ, రేవంత్ రెడ్డి ఐదేళ్లు ఇంకా సీఎం గా ఉంటారని ధృవీకరించారు. సీఎం రేవంత్ రెడ్డి తన పుట్టినరోజు వేడుకలు మూసీ నది పక్కన నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

బీఆర్ఎస్ నాయకులపై మండిపడుతూ, ఉద్యమ సమయంలో నాటకాలు ఆడేవారే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారని విమర్శించారు. హరీష్ రావు మాట్లాడుతూ, ఉద్యమంలో తాను అగ్గిపెట్టె దొరకలేదని చెప్పారని గుర్తుచేశారు. అప్పుడు నమ్మవచ్చు, కానీ ఇప్పుడు ఆ మాటలు నమ్మలేమని స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన చేపట్టాలని చెబుతున్నారని, కానీ అది జరిగితే వారి కోసం డోజర్లు పోవాలని హెచ్చరించారు. తాను జైలుకి పంపితే యోగా చేసి, పాదయాత్ర చేస్తానని కేటీఆర్ చెప్పారని, కానీ ఆయన మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు విశ్వసించరని కూడా వ్యాఖ్యానించారు. పదేళ్లపాటు మూసీని ప్రక్షాళన చేయకపోవడం గమనార్హమని అన్నారు.

Sleep: ఏ వయసు వాళ్లు ఎన్ని గంటలు నిద్రపోవాలి? పూర్తి జాబితా..