Leading News Portal in Telugu

Kishan Reddy Urges Officials to Ensure Proper Implementation of Government Schemes in Telangana


  • నగరంలో మురికివాడలు పెరిగిపోతున్నాయి
  • కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం అధికారులు కృషి చేయాలి
  • కేంద్ర ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలి : కిషన్‌ రెడ్డి
Kishan Reddy : కేంద్ర ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలి

Kishan Reddy : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం అధికారులు కృషి చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దిశా కమిటీ సమావేశం అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మైనారిటీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టళ్లు మంజూరు చేస్తే అనేక రాష్ట్రాల్లో సరైన రీతిలో అమలు కావడం లేదని, అంగన్ వాడీ స్కూళ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల నిర్మాణానికి భూమి కొరత నెలకొందన్నారు కిషన్‌ రెడ్డి. నగరంలో మురికివాడలు పెరిగిపోతున్నాయని, కేంద్ర ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. దిశా కమిటీ మీటింగులో అనేక విషయాలపై చర్చించడం జరిగిందని ఆయన తెలిపారు.

Election Commission: ఎన్నికల ప్రచారంలో మహిళలపై అనుచిత పదజాలం చేస్తే ఊరుకోం..

ప్రతి మూడు నెలలకోసారి పథకాల అమలు, కార్యక్రమాలపై అధికారులంతా రివ్యూ చేసుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణలో 70-80 శాతం రెవెన్యూ హైదరాబాద్ నుంచే వస్తున్నదని, అయినా, జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్ డిపార్ట్ మెంట్లకు నిధుల కొరత వేధిస్తోందన్నారు కిషన్‌ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ తో పాటు నగర పరిసర ప్రాంతాల ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత తీసుకోవాలని ఆయన తెలిపారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ డిపార్ట్ మెంట్ మూతబడే పరిస్థితి ఎదురైందని, ప్రభుత్వ అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలన్నారు కిషన్‌ రెడ్డి.

Uddhav Thackeray: యోగి వ్యాఖ్యలపై అజిత్ పవార్ అభ్యంతరం.. బీజేపీ కూటమిలో ఐక్యత లేదు..