Leading News Portal in Telugu

Kishan Reddy is angry with the officials that Vishwakarma scheme will be stopped


  • టెక్నికల్ సమస్యల పేరుతో ఆలస్యం చేయడం తగదన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..

  • అధికారుల నిర్లక్ష్యం కారణంగా విశ్వకర్మ పథకం ఉద్దేశం లక్ష్యం నిరుగారిపోతుందని అధికారులపై ఆగ్రహం..
Kishan Reddy: టెక్నికల్ సమస్యల పేరుతో ఆలస్యం చేయడం తగదు..

Kishan Reddy: టెక్నికల్ సమస్యల పేరుతో ఆలస్యం చేయడం తగదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా విశ్వకర్మ పథకం ఉద్దేశం లక్ష్యం నిరుగారిపోతుందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ18 వేల దరఖాస్తులు వస్తే కేవలం 620 మంది లబ్దిదారులకు మాత్రమే అందడం సిగ్గుచేటని మండిపడ్డారు. 45 రోజుల్లో పూర్తిగా ఈ కార్యక్రమాన్ని గ్రౌండింగ్ చేయకపోతే యాక్షన్ తప్పదని హేచ్చరించారు. GHMC పరిధిలో స్వచ్ఛ భారత్ లో భాగంగా టాయిలెట్ మైంటెనెన్సు పై కిషన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం సౌకర్యాలు కల్పించకపోవడం దారుణమన్నారు. స్వచ్ఛ భారత్ లో కేంద్రం వాటతో పాటు రాష్ట్ర వాటా కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

మొత్తం నగరంలో 2251 టాయిలెట్స్ ఉన్నాయి.. వాటి క్లీనింగ్, మైంటెనేన్స్ పై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసి లో స్ట్రీట్ లైట్స్ వెలిగే పరిస్థితి లేదన్నారు. తాను బస్తీల పర్యటన చేసిన సందర్భంలో ప్రజలు నా దృష్టికి అనేక సమస్యలు తీసుకొస్తున్నారని తెలిపారు. అందులో ప్రజలు ప్రధానంగా చెప్పే సమస్య స్ట్రీట్ లైట్ వెలుగకపోవడం ప్రధాన కారణంగా తెలుపారన్నారు. ఆన్ ఆఫ్ చేసే సిబ్బందికి జీతాలు ఇవ్వక స్ట్రాక్ చేస్తున్నారని మండిపడ్డారు. లైట్లు పోతే తిరిగి బిగించే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే జిహెచ్ఎంసిలో ఎన్ని లైట్లు కాలిపోయాయి, ఎన్ని వెలుగుతున్నాయో చెక్ చేయాలని ఆదేశించారు. స్ట్రీట్ లైట్స్ వెలిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు అదేశించారు.
CM Revanth Reddy: మాడవీధుల్లో గండ దీపం వద్ద దీపారాధన.. సీఎంకు పూర్ణ కుంభ స్వాగతం