Leading News Portal in Telugu

Koti Deepotsavam 2024 Day 1 Programs


  • నేటి నుంచి భక్తి టీవీ కోటి దీపోత్సవం..

  • ఎన్టీఆర్ స్టేడియం వేదికగా విశేష కార్యక్రమాలు..

  • ఏర్పాట్లు పూర్తి చేసిన భక్తి టీవీ యాజమాన్యం..
Koti Deepotsavam 2024: నేటి నుంచి కోటి దీపోత్సవం.. తొలిరోజు విశేష కార్యక్రమాలు ఇవే

Koti Deepotsavam 2024: కార్తీక మాసంలో ప్రతీ ఏటా కోటి దీపోత్సవాన్ని.. అశేష భక్తవాహిణి మధ్య నిర్వహిస్తూ వస్తోంది భక్తి టీవీ.. లక్ష దీపోత్సవంతో ప్రారంభమై.. కోటి దీపోత్సవంగా మారిన ఈ దీపాల పండగను రచన టెలివిజన్‌ లిమిటెడ్‌ ప్రతీ ఏడాది ఘనంగా నిర్వహిస్తోంది.. ఇప్పటికే ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా.. ఈ మహా దీప యజ్ఞం.. ఈరోజు ప్రారంభం కానుంది.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా ప్రతీ ఏడాది కోటి దీపాల పండుగ నిర్వహిస్తోన్న విషయం భక్తలకు విదితమే.. కార్తీక మాసంలో కోటి దివ్వెల పండుగ.. నేటి తరానికి సనాతన సంస్కృతి పరిచయం చేస్తోంది..

 

Koti Deepothsavam Ad

 

భక్తి టీవీ కోటి దీపోత్సవం 2024లో మొదటి రోజు విశేష కార్యక్రమాల విషయానికి వస్తే.. తుని తపోవనం పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ.. నంబూరు శ్రీకాళీ వనాశ్రమాధిపతి యోగిని శ్రీచంద్ర కాళీ ప్రసాద మాతాజీ గార్లచే అనుగ్రహ భాషణం.. బ్రహ్మశ్రీ డాక్టర్ మైలవరు శ్రీనివాసరావు ప్రవచనామృతం.. వేదికపై కాశీస్పటిక లింగానికి శత అష్టోత్తర శంఖాభిషకం.. భక్తులచే స్వయంగా కోటిమల్లెల అర్చన.. ఇక, కోటి దీపోత్సవం వేదికపై కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వరస్వామి కల్యాణం.. అనంతరం హంసవాహనంపై ఆదిదంపతులు దర్శనం ఇవ్వనున్నారు.. సాయంత్రం 5.30 గంటలకు భక్తి టీవీ కోటి దీపోత్సవం ప్రారంభం కానుంది.. ఇక, దీని కోసం టీజీఎస్‌ఆర్టీసీ హైదరాబాద్‌ సిటీలోని 18 డిపోల పరిధి నుంచి కోటిదీపోత్సవ వేదికకు ప్రత్యేక బస్సులు నడుపుతోన్న విషయం విదితమే.. అందరూ ఆహ్వానితులే.. కోటి దీపోత్సవంలో పాల్గొనే భక్తులకు సాదరంగా ఆహ్వానం పలుకుతోంది రచనా టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్.

Koti Deepotsavam