- హైదరాబాద్ సీపీ డీపీ తో ఫేక్ వాట్సప్ కాల్..
-
ప్రజలను భయపెట్టేందుకు సైబర్ కేటుగాళ్లు కొత్త ఎత్తుగడ.. -
పాకిస్థాన్ దేశ కోడ్ తో ఉన్న నంబర్స్ తో వస్తున్న కాల్స్.. -
ప్రజలకు సూచించిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్..

Hyderabad CP DP: సైబర్ మాయగాళ్లు డిజిటల్ అరెస్టుల పేరిట నయా దందాకు తెరలేపారు. ప్రజలను భయపెట్టేందుకు కొత్త ఎత్తుగడను అమలు చేస్తున్నారు. ఈ దందా కోసం ఏకంగా పోలీసు శాఖ అధికారులనే వాడేసుకుంటున్నారు. అధికారుల ఫోటోలను డీపీగా పెట్టుకుని వాట్సాప్ కాల్స్ చేస్తూ ప్రజలను బురిడి కొట్టించేందుకు సిద్దమయ్యారు. ఈనేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన పలువురికి నగర పోలీసు కమిషనర్(సీపీ) సీవీ ఆనంద్ చిత్రం డీపీగా ఉన్న వాట్సాప్ నెంబర్ నుంచి శుక్రవారం కాల్స్ వచ్చాయి. సీపీ ఆనంద్ డీపీ తో రావడంతో జనాలు భయాందోళన చెందారు. కాల్స్ పై సీపీ చిత్రం డీపీగా ఉండడం, ఫోన్ నెంబర్ అనుమానాస్పదంగా ఉండడంతో ఆ కాల్స్‌కు స్పందించని కొందరు విషయాన్ని సైబర్ క్రైమ్‌తోపాటు సీపీ దృష్టికి తీసుకెళ్లారు.
Read also: Hemant Soren : జార్ఖండ్ లో ఐటీ దాడులు.. సీఎం సోరెన్ ప్రైవేట్ సెక్రటరీ ఆఫీసుల్లో సోదాలు
వీటిపై వెంటనే స్పందించిన సీపీ సీవీ ఆనంద్.. తన ఫొటో డీపీగా ఉన్న నెంబర్ నుంచి వచ్చే కాల్స్‌కు స్పందించవద్దని సూచించారు. సైబర్ కేటుగాళ్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన చేశారు. ఏమైనా అనుమానాలు ఉంటే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930, డయల్-100/122 నంబర్‌లకు ఫోన్ చేసి పోలీసులను సంప్రదించాలని కోరారు. తన డీపీతో వచ్చిన ఫోన్ కాల్స్ పరిశీలించామని ఆ ఫోన్ నెంబర్ పాకిస్థాన్ కంట్రీ కోడ్(+92)తో ప్రారంభం కావడం గమనార్హం అన్నారు. ఇండియా ఫోన నెంబర్లు +91 కంట్రీ కోడ్‌తో ప్రారంభమవుతాయని ఇది ప్రజలు గమనించాలని తెలిపారు. పోలీసుల పేరుతో ఎవరు కాల్స్ చేసిన రాష్ర్ట , జిల్లా వ్యాప్తంగా ఎవరూ స్పందించాల్సి అవసం లేదని అన్నారు. ఏమైనా అనుమానం ఉంటే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930, డయల్-100/122 కాల్స్ చేయాలని రాష్ట్ర ప్రజలకు సూచించారు.
Deputy CM Pawan Kalyan: డ్రగ్స్‌పై డిప్యూటీ సీఎం పవన్ ట్వీట్.. పెనుముప్పుగా మారింది..!