Leading News Portal in Telugu

Chada Venkata Reddy said that Jamili elections are impossible.


  • దేశవ్యాప్తంగా జెమిలి ఎన్నికల పై చర్చ జరుగుతుందని జమిలి ఎన్నికలు అసాధ్యం
    ఒకే దేశం ఒక ఎన్నిక అన్నవారు రేపు ఒకే మతం అని కూడా అంటారు అని మోడీ పై మండిపాటు
    జెమిలి ఎన్నికల అంశాన్ని ముందుకు తెచ్చి ప్రజలను గందరగోళం చేయొద్దు
    మూడవసారి కేంద్రంలో బిజెపికి మెజార్టీ రాలేదు మిత్ర పక్షాలపై ఆధారపడింది
    అబద్ధపు పునాదుల మీద బిజెపి ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోంది
Chada Venkata Reddy: జమిలి ఎన్నికలు అసాధ్యం.. ప్రజలను గందరగోళం చేయొద్దు

రాజన్న సిరిసిల్లలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని సీపీఐ పార్టీ కార్మిక భవనంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతుందని.. జమిలి ఎన్నికలు అసాధ్యం అని అన్నారు. ఒకే దేశం-ఒక ఎన్నిక అన్న వారు.. రేపు ఒకే మతం అని కూడా అంటారని ప్రధాని మోడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జమిలి ఎన్నికల అంశాన్ని ముందుకు తెచ్చి ప్రజలను గందరగోళం చేయొద్దని తెలిపారు. మూడవసారి కేంద్రంలో బీజేపీకి మెజార్టీ రాలేదు.. మిత్ర పక్షాలపై ఆధారపడిందని పేర్కొన్నారు.
అబద్ధపు పునాదుల మీద బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోందని చాడ వెంకట రెడ్డి ఆరోపించారు.

సహజ సంపద కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారు.. సహజ పరం చేయడం లేదని చాడ వెంకట రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 11 మాసాలవుతుంది ప్రభుత్వం ఏర్పాటు చేసి.. కొన్ని పనులు జరుగుతున్నా.. ఇంకా ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలిపారు. చిన్న చిన్న విషయాలలో రాష్ట్ర ప్రభుత్వం అభాసు పాలవుతుందని పేర్కొన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు గత ప్రభుత్వం రూ. 200 కోట్ల పైబడి బకాయిలను పెట్టింది.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం 70% చెల్లించింది 30% చెల్లించాలి.. వాటిని కూడా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని చాడ తెలిపారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సంబంధించిన బకాయిలను పూర్తిగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.