- ఫిల్మ్ నగర్‌లో అక్రమ నిర్మాణాల తొలగింపు
-
జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఆక్రమణలను తొలగించిన హైడ్రా -
రోడ్డు ఆక్రమించి నిర్మించిన కట్టడంపై స్థానికుల ఫిర్యాదు -
లేఅవుట్ ను పరిశీలించి.. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు జరిగినట్టు నిర్ధారణ.

గ్రేటర్ పరిధిలోని అక్రమ కట్టడాలన్నీ కూల్చివేసే అధికారాన్ని తెలంగాణ ప్రభుత్వం హైడ్రాకు ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది. తాజాగా.. నగరంలోని ఫిల్మ్ నగర్‌లో అక్రమ నిర్మాణాలను తొలగించారు. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఫిల్మ్ నగర్‌లో ఉన్న ఆక్రమణలను హైడ్రా (HYDRA) తొలగించింది. ఫిలింనగర్‌లో రోడ్డు ఆక్రమించి నిర్మించిన కట్టడంపై స్థానికుల ఫిర్యాదుతో.. హైడ్రా ఫిలింనగర్ లేఅవుట్‌ను పరిశీలించింది. ఈ క్రమంలో.. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు జరిగినట్టు నిర్ధారించింది. అదే స్థలానికి అనుకుని ఉన్న ఇళ్లు ప్రహరీ కూడా ఆక్రమించి నిర్మించినట్టు గుర్తించింది హైడ్రా.
అక్కడ రేకుల షెడ్డుతో పాటు ఆ పక్కనే ఉన్న ఇంటి ప్రహరీని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారు. కూల్చివేతలు జరిగిన వెంటనే చెత్తను తొలగించింది హైడ్రా. అనంతరం జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతితో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడారు. వెంటనే రోడ్డు నిర్మించాలని జోనల్ కమిషనర్‌కు హైడ్రా కమిషనర్ సూచించింది.