Gaddar Death: అధికార లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు – Telugu News | Telangana Poet activist Gaddar passes away Live Updates condolences Telugu News
The liveblog has ended.
06 Aug 2023 09:11 PM (IST)
అధికార లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు
గద్దర్ మృతికి తెలంగాణ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. గద్దర్ మరణం బాధాకరమన్నారు మంత్రి కేటీఆర్. తన గళంతో కోట్ల మందిని గద్దర్ ఉత్తేజపరిచారని కొనియాడారు. గద్దర్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు గద్దర్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రేపు మ.12 గంటలకు గద్దర్ అంతిమయాత్ర జరగనుంది. ఎల్బీ స్టేడియం నుంచి ఇంటి వరకు అంతిమయాత్ర ఉంటుంది. గద్దర్ ఆఖరి కోరిక మేరకు అల్వాల్ మహాబోధి స్కూల్ గ్రౌండ్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి.
06 Aug 2023 08:25 PM (IST)
గద్దర్‌కు పవన్ కల్యాణ్ నివాళి
ప్రజా యుద్దనౌక గద్దర్‌కు జనసేన అధినేత, నటులు పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఎమోషనల్ అయ్యారు. గద్దర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుతెచ్చుకున్నారు. చాలా చిన్న వయస్సులో తనలో ప్రేరణను కలిగించిన ఓ మెంటర్‌ను కోల్పోయానన్నారు. గదర్ కుటుంబ సభ్యుల్ని పవన్ ఓదార్చారు.
06 Aug 2023 07:56 PM (IST)
గద్దర్ పాటకు నంది అవార్డ్
అమ్మ తెలంగాణమా, పొడుస్తున్న పొద్దుమీద పాటలతో ఉద్యమాలకు ఊపుతెచ్చారు గద్దర్. నీ పాదం మీద పుట్టుమచ్చనై.. పాటకు నంది అవార్డు కూడా వచ్చింది. అయితే ఈ నంది అవార్డ్‌ను గద్దర్ తిరస్కరించారు.
06 Aug 2023 07:52 PM (IST)
గద్దర్‌కు భార్య, ముగ్గురు పిల్లలు
ప్రజా గాయకుడు గద్దర్ ఆరోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లులు ఉన్నారు.
06 Aug 2023 07:11 PM (IST)
తెలంగాణ గొప్ప ప్రజాకవిని కోల్పోయింది- సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర గొప్ప కవిని కోల్పోయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఉద్యమ సమయంలో కూడా గద్దర్ కీలక పాత్ర పోషించారని అన్నారు.
06 Aug 2023 06:57 PM (IST)
ఎల్బీ స్టేడియంలో గద్దర్ పార్థివదేహం
ప్రజల సందర్శనార్థం ఎల్బీ స్టేడియంలో గద్దర్ పార్థివదేహాన్ని ఉంచనున్నారు. రేపటి వరకు ఆయన పార్థివదేహం ఎల్బీ స్టేడియంలో ఉండనుంది.
06 Aug 2023 06:54 PM (IST)
గద్దర్ మరణ బాధాకరం- మంత్రి కేటీఆర్
ఉద్యమ నాయకుడు, ప్రజా గాయకుడు గద్దర్ మృతి చెందడం బాధాకరమని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఉద్యమ సమయంలో గద్దర్‌తో కలిసి పని చేశామని, తన గళంతో కోట్ల మందిని గద్దర్ ఉత్తేజపరిచారన్నారు. గద్దర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
06 Aug 2023 06:26 PM (IST)
గద్దర్ మృతికి తెలంగాణ అసెంబ్లీ సంతాపం
ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేస్తుండగా, తాజాగా తెలంగాణ అసెంబ్లీ కూడా సంతాపం ప్రకటించింది. గద్దర్ మృతి చాలా బాధాకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉద్యమ సమయంలో గద్దర్‌తో కలిసి పని చేసినట్లు తెలిపారు.
06 Aug 2023 05:54 PM (IST)
గద్దర్ మృతికి చిరంజీవి, బాలకృష్ణ సంతాపం
గద్దర్ మృతిపై పలువుర రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మృతిపై మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్‌లు సంతాపం వ్యక్తం చేశారు.
06 Aug 2023 05:23 PM (IST)
గద్దర్ మృతిపై అపోలో ఆస్పత్రి వైద్యులు ప్రకటన
గద్దర్ మృతిపై అపోలో ఆస్పత్రి వైద్యులు ప్రకటన విడుదల చేశారు. జూలై 20న గద్దర్ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. ఆగస్టు 3న గద్దర్‌కు బైపాస్ సర్జరీ చేసినట్లు వెల్లడించారు. చాలాకాలంగా ఆయన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఊపిరితిత్తుల సమస్యతో గద్దర్ మృతి చెందినట్లు అపోలో వైద్యులు ప్రకటించారు. కాగా గద్దర్ మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి తరలించారు.
06 Aug 2023 04:39 PM (IST)
ఆస్పత్రి వద్దకు నేతలు, ప్రజా సంఘాల నాయకులు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న.. విమలక్క తదితరులు ఆస్పత్రి వద్దకు చేరుకుని గద్దర్‌కు నివాళులు అర్పిస్తున్నారు. పలు ప్రజా సంఘాల నాయకులతో పాటు కళాకారులు.. ఆసుపత్రి వద్దకు చేరుకుని.. డప్పుడు కొడుతూ గద్దరన్న నీకు మరణం లేదని నినాదాలు చేస్తున్నారు.
06 Aug 2023 04:31 PM (IST)
ప్రజా ఉద్యమంలో ఒక శకం ముగిసింది : చంద్రబాబు
గద్దర్ మృతి పట్ల ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. పాటతో ప్రజా చైతన్యానికి కృషి చేసిన విప్లవకారుడు గద్దర్ అని పేర్కొన్నారు. గద్దర్ తన గాత్రం ప్రజలను సంఘటితం చేశారని గుర్తు చేశారు. ఆయన మృతితో ప్రజా ఉద్యమంలో ఒక శకం ముగిసిందని పేర్కొన్నారు.
06 Aug 2023 04:11 PM (IST)
పాతికేళ్ల క్రితం గద్దర్‌పై హత్యాయత్నం
పాతికేళ్ల క్రితం గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. 1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై కాల్పులు జరిపారు దుండగులు. సికింద్రాబాద్‌లోని వెంకటాపురంలో ఆయన ఇంటికొచ్చిన ఐదుగురు అగంతకులు ఐదురౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. బుల్లెట్ గాయాలైన గద్దర్‌కు ఆనాడు గాంధీ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ జరిగింది. ఆయన శరీరం నుంచి నాలుగు బుల్లెట్లను తొలగించగా, మరో బుల్లెట్‌ను బాడీలోనే ఉంచుకొని చివరివరకు జీవించారు గద్దర్.
గద్దర్‌పై హత్యాయత్నం జరిగి 25ఏళ్లు దాటినా నిందితుల్ని ఇప్పటివరకూ పట్టుకోలేకపోయారు పోలీసులు. అసలు, కాల్పులు జరిపింది ఎవరో? ఎవరు చేయించారో? ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే, ఈ కేసును రీఓపెన్ చేసి నిందితులెవరో తేల్చాలని అనేకసార్లు ప్రభుత్వాలను, పోలీస్ ఉన్నతాధికారులను కోరారు గద్దర్. గద్దర్‌పై కాల్పులు జరిపిన అగంతకులు… అప్పుడు గ్రీన్ టైగర్స్‌గా ప్రకటించుకున్నారు. అయితే, గద్దర్‌పై కాల్పులు జరిపింది నయీమ్ ముఠానేనని అప్పట్లో ప్రచారం జరిగింది. గద్దర్ కూడా నయీం మనుషుల పనేనంటూ ఆరోపించారు. దీనిపై సిట్ ఏర్పాటు చేసినా నిందితుల్ని మాత్రం పట్టుకోలేకపోయారు పోలీసులు.
06 Aug 2023 04:06 PM (IST)
గద్దర్‌కు తెలుగుజాతి సెల్యూట్ చేస్తోంది: జగన్
గద్దర్ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం ఉహించలేనిదన్నారు. బడుగు, బలహీన వర్గాల విప్లవ స్పూర్తి గద్దర్ అని పేర్కొన్నారు. ఆయన నిరరంతరం సామాజిక న్యాయం కోసం పరితపించారని కొనియాడారు. సామాజిక న్యాయ ప్రవక్తల భావాలు, మాటలు వారి జీవితాలు ఎప్పుడూ స్పూర్తినిస్తూ జీవించే ఉంటాయన్నారు. గద్దర్ కుటుంబానికి అందరూ బాసటగా నిలవాలన్నారు. గద్దర్‌కు తెలుగుజాతి సెల్యూట్ చేస్తోందన్నారు జగన్.
06 Aug 2023 03:56 PM (IST)
గద్దర్ మరణాన్ని తట్టుకోలేకపోతున్నాం : రేవంత్ రెడ్డి
దశాబ్దాల కాలంగా ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న గద్దర్ మరణం తెలంగాణ ప్రజానీకానికి తీరని లోటు అన్నారు రేవంత్ రెడ్డి. గద్దర్ మృతికి సంతాప సూచకంగా కాంగ్రెస్ శ్రేణులు అన్ని మండల కేంద్రాలలో, ముఖ్య కూడళ్లలో గద్దర్ చిత్ర పటాలు పెట్టి నివాళులు అర్పించాలని.. కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గద్దర్ తెలంగాణ పోరాట యోధుడు.. తెలంగాణ సాధన కోసం తన ఆట, పాటలతో జనాన్ని ఉత్తేజపరిచారని కొనియాడారు. గాంధీ కుటుంబం పట్ల అపార అభిమానులు ఉన్న వ్యక్తి గద్దర్ అని.. ఇటీవలే ఖమ్మంలో గద్దర్ రాహుల్ గాంధీతో ఎంతో ఆప్యాయంగా ఉన్న.. ఆయన మరణాన్ని తట్టుకోలేక పోతున్నామన్నారు.
06 Aug 2023 03:51 PM (IST)
ప్రజల పాటకి జోహార్. ఉద్యమగీతానికి జోహార్. గద్దర్ అమర్ రహే : నారా లోకేశ్
ప్రజా గాయకుడు గద్దర్ గొంతు మూగబోయిందని సమాచారం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను అన్నారు టీడీపీ నేత నారా లోకేశ్. విప్లవోద్యమాలకి తన పాటనిచ్చారని కొనియాడారు. తెలంగాణ ఉద్యమ గళం అయిన ప్రజాయుద్ధ నౌక గద్దర్ స్మృతిలో నివాళులు అర్పిస్తున్నాను ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.