Leading News Portal in Telugu

Gold Price: హైదరాబాద్‌లో భారీగా పెరిగిన బంగారం ధర

హైదరాబాద్‌లో బంగారం ధర భారీగా పెరిగింది. స్వచ్ఛమైన బంగారం ధర రూ.47,000 మార్క్‌ను తాకింది. 24 క్యారట్ బంగారంపై రూ.190 పెరగడంతో ప్రస్తుతం రూ.47,000 దగ్గర ఆగింది. ఇక 22 క్యారట్ బంగారంపై రూ.180 పెరిగి రూ.44,420 ధరకు చేరుకుంది. హైదరాబాద్‌లో వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.41,510. హైదరాబాద్‌లో ధరలు ఇలా ఉంటే ఎంసీఎక్స్‌లో మాత్రం బంగారం ధర వరుసగా మూడో రోజు పడిపోయింది. గతవారం వరుసగా నాలుగు రోజులు బంగారం ధర పెరిగిన సంగతి తెలిసిందే. కానీ ఈ వారంలో వరుసగా మూడు రోజులుగా బంగారం ధర తగ్గుతోంది. ఎంసీఎక్స్‌లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములపై 0.35% అంటే రూ.161 తగ్గి రూ.45,905 ధరకు చేరుకుంది. సిల్వర్ ఫ్యూచర్స్ కేజీపై 0.60 శాతం అంటే రూ.250 పెరిగి రూ.41,962.00 ధరకు చేరుకుంది.

ఇప్పటికే గోల్డ్‌పైన ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరిస్తుండటం వల్ల బంగారం ధరలు తగ్గుతున్నాయని అంచనా. బంగారం ధరలు మరింత తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు. గోల్డ్ కొనాలనుకునేవారు ఇంకొన్నాళ్లు ఆగి ధర తగ్గిన తర్వాత కొనడం మంచిదని సలహా ఇస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఔన్స్ బంగారం ధర 1,708.53 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. గ్లోబల్ మార్కెట్‌లో వెండి ధరలు తగ్గాయి. ఔన్స్ వెండి ధర 15.15 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది.