Leading News Portal in Telugu

Elon Musk vs Mark Zuckerberg: ఆలూ లేదు చూలూ లేదు.. అంతా ఉత్తుత్తే!


Elon Musk vs Mark Zuckerberg: ఎలాన్ మస్క్ vs మార్క్ జుకర్‌బర్గ్.. ఈ ఫైట్ ఎప్పుడెప్పుడు జరుగుతుందా? అని విశ్వవ్యాప్తంగా అభిమానులు వేచి చూస్తుంటే, తాజాగా ఎలాన్ మస్క్ ఎవ్వరూ ఊహించని బాంబ్ పేల్చాడు. తమ మధ్య ఫైట్ అనేది ఉత్తుత్తేనంటూ ‘X’ బాస్ కుండబద్దలు కొట్టాడు. తాను ఫైట్‌ గురించి జుకర్‌బర్గ్‌తో జోక్‌ చేశానని.. ఫైట్ ప్రస్తావన రాగానే లొకేషన్ పంపమంటూ తనకు జుకర్‌బర్గ్ నుంచి సమాధానం వచ్చిందని తెలిపాడు. తొలుత తమపోటీ కోసం వేదిక ఇచ్చేందుకు ఇటలీ ముందుకొస్తే.. జుకర్‌బర్గ్ దాన్ని తిరస్కరించానన్నాడు. అప్పుడు ఫైట్ కోసం జుకర్‌బర్గ్ ఇంటినే తాను సూచించానని.. అయితే ఆయన ఇంట్లో లేరంటూ పేర్కొన్నాడు. అసలు జుకర్‌బర్గ్‌కి పోరాడే ఉద్దేశం ఉందా? అంటూ తన X ఖాతాలో ఎలాన్ మస్క్ రాసుకొచ్చారు. దీంతో.. వీరి మధ్య ఫైట్ ఉండదని తేలిపోయింది.

Eye Flu: కండ్లకలక వస్తే సింపుల్ హోం రెమిడీ.. వెంటనే ఉపశమనం

కాగా.. రాజకీయాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి మస్క్, మార్క్ పరస్పరం విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. ఇదే సమయంలో ‘X’కి పోటీగా థ్రెడ్స్‌ని తీసుకురావడంతో.. తన Xని కాపీ కొట్టి థ్రెడ్స్‌ని తయారు చేశారని మస్క్ ఆరోపించారు. అంతేకాదు.. X నుంచి తొలగించబడిన ఉద్యోగుల్ని చేర్చుకొని, వారి చేతే థ్రెడ్స్ డిజైన్ చేయించారని మస్క్ పేర్కొన్నాడు. అయితే.. మస్క్ చేసిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని, తాము X ఉద్యోగుల్ని తీసుకోలేదని మార్క్ క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే మార్క్‌తో కేజ్ ఫైట్‌కి సిద్ధమని మస్క్ సవాల్ చేశాడు. తానూ ఏం తక్కువ తినలేదన్నట్టు.. మస్క్ సవాల్‌ని మార్క్ స్వీకరిస్తూ తాను ఫైట్‌కి రెడీ అంటూ బదులిచ్చాడు. మొదట్లో ఇదంతా కేవలం తమతమ ప్లాట్‌ఫార్మ్స్‌ని ప్రచారం చేసుకోవడం కోసమే ఈ జిమ్మిక్కులకి దిగారని అంతా అనుకున్నారు. కానీ.. వీళ్లిద్దరు ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొనడం, ఫైటింగ్ దృశ్యాల్ని కూడా పోస్ట్ చేయడంతో.. తప్పకుండా వీరి మధ్య ఫైట్ ఉంటుందని భావించారు. కానీ.. ఇదంతా జోక్ అంటూ ఎలాన్ మస్క్ తాజాగా తేల్చేశాడు.

Honey Trap: క్యాన్సర్ అని చెప్పింది.. హోటల్‌కి తీసుకెళ్లి రొమాన్స్ చేసింది.. తీరా దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చింది