దూర ప్రాంతాలకు ఎక్కడికన్నా ఏదైనా పని మీద వెళ్లినప్పుడు అక్కడ మనకి ఎవరూ తెలియనివారు లేకపోతే బయట హోటల్‌లో స్టే చేయాల్సిన పరిస్థితి వస్తుంది.. అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు తో హోటల్స్ ఉంటాయి.. కొన్ని హోటల్స్ పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లు ఉన్నా బిల్లు చూస్తే తడిసి మోపడి అవుతుంది.. ఒక హోటల్‌లో ఒక నైట్ బస చేయాలంటే వేలల్లో ఖర్చవుతుంది. అదే లగ్జరీ హోటల్స్‌లో ధరలు లక్షల్లోనే వుంటాయని మీకు ఐడియా వుందా.. ఒక్కరోజు అక్కడ గడపడానికి చేసే ఖర్చుతో ఏకంగా ఒక మంచి కారు కొనుగోలు చేయొచ్చంటే మీరు నమ్ముతారా? మీరు విన్నది నిజం…
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బస చేసిన ఓ హోటల్ సింగిల్ నైట్‌కే ఏకంగా రూ.12.15 లక్షలు ఛార్జ్ చేసిందనే విషయం మీకు తెలుసా? ఇక ఆ హోటల్ పేరు లోట్టే న్యూయార్క్ ప్యాలెస్ మిడ్‌టౌన్.. ఈ ఫ్యాన్సీ హోటల్ మాన్‌హట్టన్‌లో ఉంటుంది. ఇది 1880ల కాలం నుంచే ఉంది.. రోమన్ చక్రవర్తిలా జీవించాలనుకున్న ధనవంతుడు హెన్రీ విల్లార్డ్ ఈ ప్రైవేట్ ఇల్లును నిర్మించుకున్నారట. ఇతను ఉత్తర పసిఫిక్ రైల్వే అధ్యక్షుడు, రైల్వే ఇండస్ట్రీలో పేరు, ప్రఖ్యాతలు గాంచాడు. అయితే ఆయన తరువాత 1980వ దశకంలో దీనిని లియోనా హెల్మ్‌స్లీ అనే మహిళ కొనుగోలు చేశారు. తరువాత ఆమె దానిని చాలా అక్రమంగా నడిపారని చరిత్ర చెబుతోంది..
ప్రముఖులు బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ వంటి చాలామంది దేశాధినేతలు బస చేసిన ఘనత ఆ హోటల్ కి వుంది. లోట్టే న్యూయార్క్ ప్యాలెస్‌ను CW టెలివిజన్ షో అయిన గాసిప్ గర్ల్కు సెట్టింగ్‌గా ఉపయోగించారు. షోలోని పాపులర్ క్యారెక్టర్ అయిన సెరెనా వాన్ డెర్ వుడ్‌సెన్ హోటల్ టవర్స్ పెంట్‌హౌస్ సూట్‌లో స్టే చేశారు.కాగా ఈ షో మిలీనియల్స్ 1981-1996 మధ్య బాగా ప్రాచుర్యం పొందింది. అందులో అనేక సన్నివేశాలలో హోటల్ ఆనందాన్ని మనం చూడవచ్చు. ఈ షో న్యూయార్క్ నగరంలోని సంపన్న యువకుల జీవితాల చుట్టూ తిరుగుతుంది. వారి పార్టీలు, హుక్‌అప్‌లు, ఇతర డ్రామాలకు నేపథ్యంగా హోటల్‌ను ఉపయోగించారు.. దాంతో ఈ హోటల్ బాగా ఫెమస్ అయ్యిందని తెలుస్తుంది..