Leading News Portal in Telugu

Pakistan President: అల్లా సాక్షిగా.. ఆ బిల్లులపై సంతకాలు చేయలేదు..


Pakistan President: పాకిస్థాన్ మాదీ విదేశాంగ మంత్రి, ఇమ్రాన్‌ఖాన్‌ సన్నిహితుడైన షా మహమ్మద్ ఖురేషీని పోలీసులు అరెస్ట్ చేయడం దాయాది దేశంలో ప్రకంపనలు రేపుతోంది. అధికారిక రహస్యాల చట్టం కింద ఖురేషీని అదుపులోకి తీసుకోవడం ఈ సంచలనాలకు కారణమైంది. చట్టంగా రూపొందించిన అధికారిక రహస్యాల చట్టం, పాక్‌ సైన్య చట్టాల సవరణ బిల్లులపై తాను సంతకాలు చేయలేదని పాక్‌ అధ్యక్షుడు అరిఫ్‌ అల్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లాయే సాక్ష్యం. ఈ సవరణ బిల్లులపై సంతకాలు చేయలేదు. వీటితో విభేదించాను. సంతకం చేయని ఆ బిల్లులను నిర్దిష్ట సమయంలో తిరిగి పంపమని చెప్పాను. కానీ నా సిబ్బందే నన్ను మోసం చేశారు. నా అధికారాన్ని ఖాతరు చేయలేదు’’ అని పేర్కొన్నారు.

ఆ బిల్లులను తాను వ్యతిరేకించానని, సంతకం చేయని ఆ బిల్లులను నిర్దిష్ట సమయంలో తిరిగి పంపమని చెప్పానని, అందుకు అల్లాయే సాక్ష్యమని పేర్కొన్నారు. కానీ తన సిబ్బందే తనను మోసం చేశారని, తన అధికారాన్ని ఖాతరు చేయలేదని వాపోయారు. అయితే, న్యాయశాఖ మాత్రం అల్వీ ప్రకటనను ఖండించింది. రాజ్యాంగంలోని అధికరణం 5 కింద నిర్దిష్ట సమయంలో బిల్లులను పంపలేదని, అందుకే అవి చట్టాలుగా మారాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం జైలులో ఉన్న పాక్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌కు అల్వీ సన్నిహితుడన్న పేరుంది. చట్టంగా రూపొందించిన అధికార రహస్యాల చట్టం ప్రకారమే ఇమ్రాన్‌ఖాన్ మరో స్నేహితుడైన షా మహమ్మద్ ఖురేషీని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు.