Jeff Bezos: ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు.. అంటే జీవితంలో వీటికి చాలా ప్రాధాన్యత ఉంది.. అప్పుచేసైనా ఇల్లు కట్టడం లేదా కట్టిన ఇల్లు కొనడానికి ప్రయత్నాలు చేస్తుంటారు.. ఇక బ్యాంక్‌లు లోన్స్ కూడా ఇస్తుండడంతో ఇళ్లు కొనేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది.. అయితే, కొనే స్థోమత ఉన్నా.. కొందరు అద్దె ఇళ్లలో గడుపుతుంటారు.. ఆ కోవలోకి వచ్చే వ్యక్తి.. ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరైన అమెజాన్ ఫౌండర్ ‘జెఫ్ బెజోస్’.. ఇటీవల తన ప్రియురాలు లారెన్ శాంచెజ్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం విదితమే కాగా.. ఇప్పుడు, తన ఆస్తిని మొత్తం పక్కన బెట్టి.. ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు.. అయితే, ఆ ఇంటి అద్దె తెలిస్తే మాత్రం నోరువెళ్లబెట్టాల్సిందే.. ఇండియన్ కరెన్సీలో నెలకు రూ.5 కోట్ల వరకు అద్దెను చెల్లిస్తున్నారట..
జెఫ్ బెజోస్ కాబోయే భార్యతో కలిసి కాలిఫోర్నియా కాపురం పెట్టారట.. హాలీవుడ్ మ్యుజిషియన్ కెన్నీ జీకి చెందిన ఈ భవనం 5,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందట.. ఎన్నో ప్రత్యేకతలు ఈ భవనం సొంతం.. రికార్డింగ్ స్టూడియో, స్విమ్మింగ్ పూల్, గార్డెన్స్ వంటి అనేక లగ్జరీ సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి.. ఇందులో 3,500 చదరపు అడుగుల గెస్ట్‌హౌస్ కూడా ఉంది. అందుకే అదేస్థాయిలో దీని అద్దె కూడా వసూలు చేస్తున్నారు.. నెలకు 600000 డాలర్లు అంటే.. ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 5 కోట్లు అద్దెగా చెల్లిస్తున్నారట జెఫ్ బెజోస్..
జెఫ్ బెజోస్ జంట ఈ సంవత్సరం మార్చి నుండి ఈ ఆస్తిని అద్దెకు తీసుకున్నారు. అద్దె నెలకు సుమారు రూ. 5 కోట్లుగా ఉండగా.. బెజోస్ మరియు అతని కాబోయే భార్యకు చెందిన వస్తువులతో అలంకరించబడిందట.. ఈ బిలియనీర్ జంట మాలిబు మాన్షన్‌ను అద్దెకు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది, అయితే బెజోస్ స్వంత బెవర్లీ హిల్స్ ఆస్తి పునర్నిర్మాణంలో ఉంది. అందుకే ఇక్కడ అద్దెకు దిగినట్టుగా తెలుస్తోంది. అయితే, హైదరాబాద్ లాంటి సిటీల్లో శివారు ప్రాంతాలకు వెళ్తే.. రూ.50 లక్షల వరకు ఇళ్లు కూడా దొరికే పరిస్థితి ఉంది.. ఈ లెక్కన.. జెఫ్ బెజోస్ చెల్లించే అద్దెతో ఇక్కడైతే ఏకంగా పది ఇళ్లకు పైగా కొనుగోలు చేయవచ్చన్నమాట..