Indian American Murdered Girl Friend: ఈ మధ్య చిన్న చిన్న గొడవలకే మనుషులు దారుణాలకు ఒడిగడుతున్నారు. విచక్షణ కోల్పోయి ప్రాణాలు తీసేవారు వెళుతున్నారు. మనిషి ప్రాణాలకు విలువ లేకుండా చేస్తున్నారు. ఆవేశంతో తాము ప్రేమించిన వారినే బలి తీసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకుంది. వివరాళ్లోకి వెళ్తే.. అగ్రరాజ్యం అమెరికాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ భారతీయ అమెరికన్ తన ప్రియురాలిని చిన్నపాటి గొడవ కారణంగా కాల్చి చంపాడు. 29 ఏళ్ల సిక్కు యవకుడు ఈ ఘోరం చేశాడు.సిమ్రంజిత్ సింగ్ అనే వ్యక్తి కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. గత శనివారం నాడు అతను తన గర్ల్ ఫ్రెండ్ ను తీసుకొని స్థానికంగా ఉండే ఒక షాపింగ్ మాల్ కు వెళ్లాడు. అప్పటి వరకు వారు చాలా సరదగా గడిపారు. అయితే షాపింగ్ ముగించుకొని కారు పార్కింగ్ దగ్గరకు వచ్చిన వారికి అక్కడ ఏదో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ యువకుడు కారులో నుంచి గన్ తీసి ప్రియురాలిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దాంతో అమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఈ ఘటన అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు చోటుచేసుకుంది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను కాపాడటానికి అతను ప్రయత్నించలేదు. రక్తపు మడుగులో పడివున్న ఆమెను అక్కడే వదిలేశాడు.