Yevgeny Prigozhin: వాగ్నర్ కిరాయి సైన్యానికి చీఫ్‌గా ఉన్న యెవ్జెనీ ప్రిగోజిన్ కొన్ని రోజుల క్రితం ఓ విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు అత్యంత సన్నిహితుడైన ప్రిగోజిన్, చివరకు పుతిన్ పైనే తిరుగుబాటు చేసే ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారి వార్తల్లో వ్యక్తి అయ్యారు. అయితే బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో సయోధ్యతో ఈ తిరుగుబాటు ముగిసింది.
అయితే తిరుగుబాటు తర్వాత గత వారం అనుమానాస్పదంగా విమాన ప్రమాదంలో మరణించాడు. అయితే ఆయన మరణానికి పుతినే కారణం అంటూ వెస్ట్రన్ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రిగోజిన్ కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారుతోంది. ఆగస్టు 21న ప్రిగోజిన్ ఈ వీడియోలో మాట్లాడినట్లు తెలుస్తోంది.
‘‘నేను బతికున్నానా.. లేదా అని చర్చించుకుంటున్న వారికి అంటూ.. నేను ఎలా ఉన్నానని..? ప్రశ్నించడం ఈ వీడియోలో చూడవచ్చు. ప్రస్తుతం వీకెండ్ ఆగస్టు 2023 సెకండ్ ఆఫ్, నేను ఆఫ్రికాలో ఉన్నాను’’ అంటూ ప్రిగోజిన్ చెప్పడం ఈ వీడియోలో చూడవచ్చు. నన్ను తుడిచిపెట్టడం లేదా.. నా వ్యక్తిగత జీవితం గురించి చర్చించడానికి ఇష్టపడే వ్యక్తుల కోసం, నేను ఎంత సంపాదిస్తున్నాను, లేదా మరేదైనా సరే అంతా ఓకే అంటూ ప్రిగోజిన్ కామెంట్ చేశారు. ఈ వీడియో ఆయన టెలిగ్రామ్ ఛానెల్ లో వచ్చింది. ఇది ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ గా మారింది.
వాగ్నెర్ చీఫ్ ప్రిగోజిన్ మరణానికి కొన్ని రోజలు ముందు ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన ప్రయాణిస్తున్న విమానం మాస్కోకు సమీపంలో ప్రమాదాని గురై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ప్రిగోజిన్ తో పాటు అతని బాడీగార్డులు, సన్నిహితులు మొత్తం 9 మంది మరణించారు. రష్యా అత్యంత రహస్యంగా అతని అంత్యక్రియలను ముగించింది.
A video of Prigozhin appeared that is reportedly filmed in Africa not long before his death.
“So, fans of discussing my death, intimate life, earnings, etc., I am doing fine,” Prigozhin says. pic.twitter.com/UcIKpgLNZi— Anton Gerashchenko (@Gerashchenko_en) August 31, 2023