విజయం సాధించాలంటే కాస్త కష్టపడాలి.. అలాగే సహనంగా కూడా ఉండాలి.. కష్టే ఫలి అని ఊరికే అనలేదు పెద్దలు.. తాజాగా ఓ విచిత్ర ఘటన వెలుగు చూసింది..ఏదైనా అనుకుంటే మాత్రం సాధించవచ్చు అని చాలా మంది అనుకుంటారు.. అదే ఇప్పుడు నిరూపించి చూపించారు ఇద్దరు అమెరికన్లు ఐడాహో రాష్ట్రానికి చెందిన డేవిడ్ రష్ ఇప్పటివరకూ 250కి పైగా గిన్నిస్ వరల్డ్ రికార్డులను కొల్లగొట్టాడు…
విషయానికొస్తే.. సాదారణ యూట్యూబ్, టిక్‌టాక్ స్టార్‌గా వెలుగొందుతున్న జాష్ హార్టన్ పేరిట 30 వరకూ గిన్నిస్ రికార్డులున్నాయి. ఈ ఇద్దరూ మరో గిన్నిస్ రికార్డు కోసం సంయుుక్తంగా ప్రయత్నించి సంచలనం సృష్టించారు.. ఒకే నిమిషంలో 153 సార్లు పరస్పరం కౌగిలించుకుని పూర్వపు రికార్డును అధిగమించే ప్రయత్నం చేశారు. మొత్తం 163 సార్లు కౌగిలింతలకు ప్రయత్నినంచిన వారు చివరకు 153 సార్లు హగ్ చేసుకున్నట్టు గిన్నిస్ రికార్డుకు లెక్కలు సమర్పించారు..
అయితే వీరిద్దరూ కూడా కౌగిలింతలు చేసుకొనే సమయంలో చేతులు పట్టుకోవాలనే నిబంధన లేకపోవడంతో ఈ రికార్డ్ సాధ్యమైందని వారు చెబుతున్నారు.. గతంలో జరిగిన ఓ ప్రయత్నంలో అభ్యర్థులు తమ చేతులు పూర్తిగా కిందకు దింపకుండానే మరో కౌగిలింతకు ప్రయత్నించారన్న విషయాన్ని తాము గుర్తించినట్టు పేర్కొన్నారు. తమకు గిన్నిస్ రికార్డ్స్ నుంచి తీపి కబురు తప్పక వస్తుందని అని అనుకున్నాము.. గిన్నిస్ రికార్డు కోసం అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలనకు పట్టే సమయం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని గిన్నిస్ రికార్డ్స్ వారు తమ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఇక ఏదాని మీద రికార్డ్ సాధించారనే దానిపై పూర్తి పరిశీలన జరిపి రికార్డ్ ను ఇస్తారని చెబుతున్నారు.. మొత్తానికి ఈ వార్త వైరల్ అవుతుంది..