Leading News Portal in Telugu

Jupiter: గురుగ్రహాన్ని ఢీకొట్టిన ఖగోళ శకలం.. భారీ విస్పోటనం.. ఈ వీడియో చూడండి..


Jupiter: సౌర కుటుంబంలో అత్యంత పెద్ద గ్రహం గురుగ్రహం. దాదాపుగా 1300 భూమిలను తనలో ఇముడ్చుకోగలదు. సూపర్ గ్యాస్ జాయింట్ అయిన గురుగ్రహం సౌరకుటుంబంలో ‘వాక్యూమ్ క్లీనర్’గా పనిచేస్తుంటుంది. తన అపారమైన గురుత్వాకర్షణ శక్తితో గ్రహశకలాలను, తోకచుక్కలను తనవైపు ఆకర్షిస్తుంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఖగోళ శకలం గురు గ్రహాన్ని ఢీకొట్టింది. దీంతో గ్రహంపై భారీ విస్పోటనం ఏర్పడినట్లు కనిపించింది. ఆగస్ట్ 29 (ఆగస్టు 28న 1645 GMT) సమయంలో ఓ గుర్తుతెలియన ఓ ఖగోళ వస్తువు గురుగ్రహాన్ని ఢీకొట్టిన ఘటన ఆర్గనైజ్డ్ ఆటోటెలీస్కోప్‌లు ఫర్ సెరెండిపిటస్ ఈవెంట్ సర్వే (OASES) ప్రాజెక్ట్ మరియు ప్లానెటరీ అబ్జర్వేషన్ కెమెరా ఫర్ ఆప్టికల్ ట్రాన్సియెంట్ సర్వేస్ (PONCOTS) సిస్టమ్ ఈ ఖగోళ దృశ్యాన్ని గుర్తించాయి. వీటి ట్విట్టర్ అకౌంట్ లో దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది.

గురుగ్రహం గ్రహశకలాలు ఎక్కువగా తిరిగే ఆస్ట్రాయిడ్ బెల్ట్ కి దగ్గరగా ఉంది. ఏదైనా గ్రహశకలం తన మార్గం నుంచి పక్కకు తప్పుకున్న వెంటనే ఈ భారీ గ్యాస్ జాయింట్ తన గురుత్వాకర్షణతో తన వైపు లాగేసుకుంటుంది. 1994లో షూమేకర్ లేవీ 9 అనే తోకచుక్క ఇలాగే బృ‌హస్పతిని ఢీకొట్టింది. ఈ తాకిడి వల్ల గురుడి ఉపరితలంపై పెద్ద వెలుగు కనిపించింది. దీన్ని హబుల్ టెలిస్కోప్ చిత్రీకరించింది. గురు గ్రహం భూమితో పాటు అంతర సౌరకుటుంబంలోని గ్రహాలను కాపాడుతుంది. ఒక వేళ గురుగ్రహమే లేకుంటే ఆస్ట్రాయిడ్ బెల్ట్ లోని గ్రహశకలాలు దారి తప్పి భూమి వైపు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండేది.