
G20 Summit: పెరుగుతున్న చైనా ప్రభావాన్ని అడ్డుకునేందుకు అగ్రదేశం అమెరికా, భారత్ పావులు కదుపుతున్నాయి. రైల్, ఓడరేవుల మెగా డీల్‌పై అమెరికా, సౌదీ అరేబియా, భారత్, ఇతర దేశాలు చర్చలు జరుపుతున్నట్టు రాయిటర్స్ శుక్రవారం ప్రకటించింది. దీనిపై అమెరికన్ న్యూస్ లెటర్ ఆక్సియోస్ కథనాన్ని నివేదించింది. సౌదీ అరేబియా, ఇజ్రాయిల్ మధ్య 2024కి ముందే సాధారణీకరణ ఒప్పందాన్ని పూర్తి చేయాలని బైడెన్ అడ్మినిస్టేషన్ భావిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా లెవాంట్, గల్ఫ్ లోని ఇతర అరబ్ దేశాలను కలుపుతుందని భావిస్తున్నారు. గల్ఫ్ లోని ఓడరేవుల ద్వారా భారతదేశాన్ని కూడా ఈ ప్రాజెక్టుతో అనుసంధానించనున్నారు.
Read Also:Goa Tsunami Alert: సునామీ హెచ్చరిక.. అర్థరాత్రి వణికిపోయిన జనం
భారత్, ఇజ్రాయిల్, అమెరికా,యూఏఈ సభ్యదేశాలుగా ఉన్న I2U2 సమావేశంలో ఈ ప్రాజెక్టు ఆలోచన వచ్చింది. మిడిల్ ఈస్ట్ లో మౌళిక సదుపాయాల గురించి చర్చించడానికి, ఆ ప్రాంతంలో చైనా ప్రాబల్యం పెరుగుదలకు ధీటుగా I2U2 ఫోరమ్ 2021లో ఏర్పాటైంది. ఈ ప్రాంతాలను రైల్వే ద్వారా అనుసంధానించాలనే ఆలోచనను ముందుగా ఇజ్రాయిల్ లేవనెత్తింది. ఈ ప్రాజెక్టులో భారత నైపుణ్యాన్ని ఉపయోగించాలని ఈ ఆలోచన చేసింది. ఈ దేశాలతో పాటు ఇందులో సౌదీ అరేబియా భాగస్వామ్యాన్ని బైడెన్ అడ్మినిస్టేషన్ విస్తరించింది. చైనా బెల్ట్ అండ్ రోడ్ విజన్ ను అడ్డుకునేందుకు ఈ దేశాలు ఈ మెజా ప్రాజెక్టుపై ఆలోచన చేస్తున్నాయి.
ఈ మేజర్ రైల్వే ప్రాజెక్టు ద్వారా గల్ఫ్, అరబ్ దేశాలను అనుసంధానం చేయడానికి భారత్, యూఏఈ, సౌదీతో అమెరికా రైల్వే ఒప్పందం చేస్తున్న తరుణంలో దీనిపై వైట్‌హౌజ్ ప్రతినిధి జెక్ సుల్లివన్ మాట్లాడుతూ.. దీనిపై ప్రస్తుతం నేను ఏం ధృవీకరించలేదనని.. మేము మా భాగస్వామ్య సభ్యదేశాలతో కలిసి కృషి చేస్తాం. భారతదేశం నుంచి మిడిల్ ఈస్ట్, ఐరోపా కనెక్టివిటీ చాలా ముఖ్యమైందని, ఇందులో అన్ని దేశాలు ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలు పొందుతాయని అన్నారు.