Libya Floods: డేవియల్ తుపాన్ ఉత్తర ఆఫ్రికా దేశం లిబియాను అతలాకుతలం చేసింది. తుపాను, వరదల కారణంగా ఏకంగా 20,000 మంది చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. సోమవారం నుండి కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. ఈ వరద తాకిడికి పెద్ద పెద్ద భవనాలు నేలకూలాయి. ఈ ఘటనలో వేలమంది ప్రాణాలను కోల్పోయారు.అంతర్జాతీయ మాధ్యమాల సమాచారం ప్రకారం.. లిబియా నగరమైన డెర్నాలో 100,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. కాగా డేనియల్ తుఫాను కారణంగా సంభవించిన వరద కారణంగా మధ్యధరా తీర నగరమైన డెర్నా ఘోరంగా దెబ్బతింది. అందులో చాలా మంది తమ బంధువులను, రక్త సంబంధీకులను కోల్పొయారు.
ఈ వరదల కారణంగా ఏకంగా 20,000 మంది చనిపోయి ఉంటారని అల్-గైతీ సౌదీ యాజమాన్యంలోని అల్ అరేబియా టెలివిజన్‌తో మాట్లాడుతూ డెర్నా మేయర్ అబ్దుల్మేనమ్ తెలిపారు. వరదల కారణంగా ధ్వంసమైన జిల్లాల సంఖ్య ఆధారంగా నగరంలో మరణాల సంఖ్య 18,000 నుండి 20,000 వరకు ఉంటుందని అంచన వేస్తున్నట్లు వెల్లడించారు. బీచ్ ఒడ్డున ఎక్కడ చూసినా శవాలు, బట్టలు, వస్తువులు చెల్లాచెదురుగా పడి కనిపిస్తున్నాయని వాటిని చూస్తుంటే ఎంతో బాధగా ఉంది అని పేర్కొ్న్నారు. శవాలను తగుల బెట్టడానికి కూడా స్థలం లేక సామూహిక ఖననం చేస్తున్నట్లు వెల్లడించారు. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఓ వ్యక్తి తన భార్య, ఐదుగురు పిల్లల జాడ కనుక్కోవటానికి వరద వచ్చిన నాటి నుంచి ప్రయత్నిస్తున్నా కనుక్కోలేకపోతున్నారు అని అబ్దుల్మేనమ్ తెలిపారు. వరద సంభవించిన సమయంలో చాలా మంది నిద్రలోనే జల సమాధి అయిపోయారని పేర్కొన్నారు. ఇక ఇటీవలే ఆఫ్రికా ఖండ దేశమైన మొరాకోలో భూకంపం కారణంగా రెండు వేల మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే.