Leading News Portal in Telugu

Britain Female Surgeons: షాకింగ్ సర్వే.. బ్రిటన్ మహిళా సర్జన్లకు వేధింపులు అధికం


One out of Every three Women Surgeons Facing Sexual Harassment in Britain: మహిళలకు ఏ రంగం అయినా వేధింపులు తప్పడం లేదు.  ఎంటర్ టైన్ మెంట్ రంగంలోనే ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే ఫీల్డ్ ఏదైనా ప్రతి చోట ఇలాంటివి తప్పనిసరిగా మారిపోయాయి మహిళలకు.  తాజాగా బ్రిటన్ కు సంబంధించి బయటపడిన ఓ సర్వే షాకింగ్ కు గురిచేస్తుంది. యునైటెడ్ కింగ్ డమ్  నేషనల్ హెల్త్ సర్వీస్ లో ప్రతీ ముగ్గురు మహిళా సర్జన్‌లలో ఒకరు లైంగిక వేధింపులకు గురవుతున్నట్లుగా తెలుస్తుంది. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ సర్జరీ నిర్వహించిన సర్వేలో నివేదికల ప్రకారం 11 అత్యాచార సంఘటనలు కూడా జరిగాయి. దీనిని మహిళ సర్జన్ ల మీ టూగా అభివర్ణించవచ్చు అని ఆ సర్వే పేర్కొంది. మహిళా సర్జన్లలో 30% మంది లైంగిక వేధింపులకు గురయ్యామని వెల్లడించారు. వీరిలో 29% మంది మహిళలు పని చేస్తున్న సమయంలో శారీరక వేధింపులకు గురయ్యామన్నారు.  40% కంటే ఎక్కువ మంది తమ శరీరం ఎలా పడితే అలా మాట్లాడిన భరించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇక 90% మంది మహిళలు గత ఐదేళ్లలో లైంగిక దుష్ప్రవర్తనను చూశామని చెప్పారు. 81% మంది పురుషులు కూడా సర్వే సమయంలో లైంగిక దుష్ప్రవర్తనకు సంబంధించిన సందర్భాలను చూశామని పేర్కొ్న్నారు.

ఇక సర్జరీ సమయంలో చెమటపట్టినప్పుడు ఓ డాక్టర్ తన ఛాతీకి దగ్గరగా వచ్చి తల తుడిచుకున్నాడని, తరువాత కూడా అలా చేయబోతే టవల్ ఇచ్చినట్లు ఆమె తెలిపింది. ఇక ఒక డాక్టర్ అయితే బలవంతంగా తన ఇంటికి వచ్చి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని మరో మహిళ సర్జన్ తెలిపారు. ఈ సమస్య గురించి ఎన్‌హెచ్‌ఎస్ ట్రస్ట్, జనరల్ మెడికల్ కౌన్సిల్ లేదా రాయల్ కాలేజీల వంటి సంస్థలకు ఫిర్యాదు చేసినా లాభం లేదని వాటిపై తమకు విశ్వాసం లేదని తెలిపారు. ఈ నివేదిక చాలా బాధాకరమైన అనుభవాన్ని  కలిగిస్తుందని,  వేధింపులకు గురైన వారికి అండగా నిలబడతామని ఇంగ్లండ్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్‌లో ఉమెన్ ఇన్ సర్జరీ ఫోరమ్‌కు అధ్యక్షత వహించే కన్సల్టెంట్ సర్జన్ టామ్‌జిన్ కమింగ్ తెలిపారు.