China: జపాన్ లోని అమెరికా రాయబారి రహమ్ ఇమ్మాన్యుయేల్ ఎక్స్(ట్విట్టర్)లో ఓ పోస్టు చేశారు. ‘మొదటిది రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫు 3 వారాల నుంచి కనిపించడం లేదు. రెండోది అతడిని గృహనిర్భందంలో ఉంచినందుకే వియత్నా పర్యటనలో కనిపించలేదు, సింగపూర్ నేవీ చీఫ్ తో సమావేశం కాలేదు..?’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఇటు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ, రక్షణమంత్రిత్వ శాఖలు ఇప్పటి వరకు స్పందించలేదు.
గత వారం వియత్నాం రక్షణ అధికారుల సమావేశం నుంచి షాంగ్‌ఫై హఠాత్తుగా వైదొలిగారు. చివరిసారిగా అతను ఆగస్టు 29న బీజింగ్ లో జరిగిన ఆఫ్రికన్ దేశాల భద్రతా ఫోరమ్ సమావేశంలో కీలక ప్రసంగం చేస్తూ కనిపించారు. ప్రస్తుతం లీ షాంగ్‌ఫుని విచారిస్తున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ అనుమానిస్తోంది. లీ చైనాలో ఐదుగురు స్టేట్ కౌన్సిలర్లలో ఒకరు. ఇది సాధారణ మంత్రి కంటే ఉన్నతమైన క్యాబినెట్ హోదా.
ఇటీవల కాలంలో చైనా ప్రభుత్వం, సైన్యంలో కీలకంగా ఉన్నవాళ్లంతా కనిపించకుండా పోతున్నారు. గతంలో విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్, ఆ తరువాత రాకెట్ ఫోర్స్ కమాండర్లు తప్పిపోయాయి. జులైలో చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ అదృశ్యమైన తర్వాత షాంగ్‌ఫు అదృశ్యమయ్యాడు.దాదాపు రెండు నెలల క్రితం, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ నుండి ఇద్దరు టాప్ జనరల్‌లను తొలగించారు, ఇది దేశం యొక్క సాంప్రదాయ మరియు అణు క్షిపణులను పర్యవేక్షిస్తున్న ఎలైట్ ఫోర్స్.