Leading News Portal in Telugu

Petrol Diesel Rates in Pakistan: భారీ షాక్.. లీటరు పెట్రోల్ పై రూ. 26, డీజిల్ రూ.17 పెంపు


Petrol Diesel Rates in Pakistan: పొరుగు దేశం పాకిస్థాన్‌ పరిస్థితి దారుణంగా తయారైంది. అక్కడి ప్రజలు రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రతిరోజూ వస్తువుల ధరలను పెంచుతూనే ఉంది. ఇప్పుడు ఇంధన ధరలను భారీగా పెంచింది. పాకిస్థాన్‌లో పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్ ధరను రూ.26, 2 పైసలు పెంచింది. కాగా డీజిల్‌పై రూ.17 34 పైసలు పెరిగింది. ఈ పెరుగుదల వల్ల అక్కడి ప్రజలు మరింత ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజలకు ఉపశమనం కల్పిస్తామని పాకిస్థాన్ ప్రభుత్వం హామీ ఇచ్చినా ఈ పెరుగుదల ద్రవ్యోల్బణం ఒత్తిడిని పెంచడం గమనార్హం.

ఇప్పుడు కొత్త ధర ఎంత?
గత వారం పెట్రోలియం డీలర్లు, చమురు మార్కెటింగ్ కంపెనీల మార్జిన్లను పెంచడానికి ఆర్థిక సమన్వయ కమిటీ (ఇసిసి) ఆమోదం తెలిపింది. పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాల మార్జిన్‌ను లీటరుకు రూ.3.5 పెంచేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం పెంచిన ఇంధన ధరల కారణంగా పెట్రోల్ ధర లీటరుకు రూ.331 38 పైసలు కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.329 18 పైసలుగా మారింది.

ప్రభుత్వం వాదన  
ఓఎంసీలు, డీలర్ల కోసం పెట్రోల్, డీజిల్ అమ్మకాల మార్జిన్‌లను పెంచడానికి ఈసీసీ ఆమోదించింది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే, గ్లోబల్ కమోడిటీ ధరలు పెరుగుతూనే ఉన్నందున పెట్రోలియం ధరలను పెంచాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. పాకిస్థాన్ కొన్నేళ్లుగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. చిన్నచిన్న వస్తువులను సైతం ఖరీదైన ధరలకు విక్రయిస్తున్నారు. ఈఎంఎఫ్, బెయిలౌట్ ఫండ్ నుండి కొంత ఉపశమనం లభించినప్పటికీ ద్రవ్యోల్బణంలో గణనీయమైన తేడా ఏమీ లేదు.