Leading News Portal in Telugu

Italy Earthquake: ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో భూకంపం.. పరుగులు తీసిన జనం


Italy Earthquake: ఇటలీలో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.8గా నమోదైంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోఫిజిక్స్ అండ్ వాల్కనాలజీ ప్రకారం, దాని భూకంప కేంద్రం ఫ్లోరెన్స్‌కు ఈశాన్యమైన మరాడి సమీపంలో ఉందని నివేదించింది. సోమవారం తెల్లవారుజామున ఫ్లోరెన్స్, టుస్కానీలో 4.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని భూగర్భ శాస్త్రవేత్తలు,అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా జరిగిన ఆస్తి నష్టం, గాయాల గురించి తక్షణ నివేదికలు లేవు.

ఈ భూకంపం ఉదయం 5.10 గంటలకు సంభవించించింది. తర్వాత మరికొన్ని చిన్నపాటి ప్రకంపనలు వచ్చాయి. ఆందోళన చెందిన నివాసితుల నుంచి తమకు కొన్ని కాల్స్ వచ్చాయని, అయితే ఇప్పటివరకు నష్టం లేదా గాయాల గురించి ఎటువంటి నివేదికలు లేవని ఇటలీ అగ్నిమాపక బృందం తెలిపింది. ఈ ప్రాంతంలో భూకంపాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఏజెన్సీ పేర్కొంది. ముఖ్యంగా, 1919 నాటి ముగెల్లో భూకంపం 20వ శతాబ్దంలో ఇటలీని తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపాలలో ఒకటిగా పేర్కొనబడింది.