Leading News Portal in Telugu

Onion: ఫలించిన 12 ఏళ్ల నిరీక్షణ.. 9 కిలోల ఉల్లిగడ్డ పండించి రికార్డు


UK Gardener Creates Record By Grows Massive 9 kgs onion: ఉల్లిపాయలు ఇవి లేకపోతే మనం చాలా వంటకాలు చేయలేము. మనం నిత్యం ఆహారపదార్థాల్లో ఉపయోగించే వాటిలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. పానీపూరి దగ్గర నుంచి చాలా మందికి ఇష్టమైన మసాలా కూరల వరకు ప్రతి దాంట్లో మనకు ఈ ఉల్లిగడ్డలు ఉండాల్సిందే. అయితే సాధారాణంగా ఉల్లిపాయ ఎంత బరువు ఉంటుంది. 100 గ్రా నుంచి మహా అయితే 200 గ్రాములు ఇంకా కావాలంటే ఒక అరకేజీ ఉండోచ్చు. అరకేజీ అంటేనే అమ్మో అనిపిస్తుంది కదా. అలాంటిది ఓ రైతు ఏకంగా 9 కేజీల బరువు ఉన్న ఉల్లిగడ్డను పండించి ఏకంగా రికార్డు క్రియేట్ చేశాడు.

యూనిటైడ్ కింగ్ డమ్ లోని  గ్వెర్న్సే ప్రాంతానికి చెందిన రైతు గారెత్ గ్రిఫిన్ (65) ఎన్నో ఏళ్లుగా పంటలు పండిస్తున్నాడు. అయితే అతడు ఓ భారీ ఉల్లిగడ్డను పండించి వరల్డ్ రికార్డు క్రియేట్ చేయాలని తపనపడేవాడు. అయితే 12 ఏళ్లు కష్టపడి ఎట్టకేలకు ఇటీవల ఓ భారీ ఉల్లిపాయను పండించాడు. దాని బరువు దాదాపు 8.9 కిలోలు. ఇక దాని పొడవు విషయానికి వస్తే 21 అంగుళాలు ఉంటుంది. దీనిని ఆయన ఆరోగేట్ ఆటమ్ ఫ్లవర్ షోలో ప్రదర్శించారు. అయితే ఇది ప్రపంచ రికార్డు అని  ఆరోగేట్ ఆటమ్ ఫ్లవర్ షో తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ప్రకటించింది. అయితే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇంకా దీనిని గుర్తించలేదు. అయితే దీనిని తయారుచేయడానికి చాలా కష్టపడ్డానని చెబుతున్నారు గారెత్ గ్రిఫిన్.  తన తండ్రి కూడా పెద్ద సైజు ఉల్లిగడ్డలను సాగు చేసేవారని చెబుతున్న గారెత్ తాను కూడా ఓ పెద్ద ఉల్లిగడ్డను సాగుచేసి రికార్డు క్రియేట్ చేయాలని తపన పడ్డానని చెబుతున్నారు. ఇంతపెద్ద ఉల్లిగడ్డను పండించడానికి అదనపు లైటింగ్, ఆటోమేటిక్ ఇరిగేషన్ వంటి ప్రత్యేక చర్యలు అవసరమని వివరిస్తున్నారు.  సరైన విత్తనాలు, సరైన సాగు విధానాలతోనే ఇలాంటివి సాధ్యమని పేర్కొంటున్నారు గారెత్. ఈ భారీ సైజ్ ఉల్లిగడ్డలతో వంట కూడా చేసుకోవచ్చని అయితే సాధారణ ఉల్లిపాయల కంటే వీటి రుచి కొంచెం తక్కువగా ఉంటుందని గారెత్ పేర్కొ్ంటున్నారు. దీనిని చూసిన యూజర్లు సైతం వావ్, ఇది నిజంగా అద్భుతం అంటూ స్పందిస్తున్నారు.