China: దక్షిణ చైనాలోని బొగ్గు గనిలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో 16 మంది మరణించారు. గుయిజౌ ప్రావిన్స్‌లోని పంఝౌ నగరంలోని షాంజియావోషు బొగ్గు గనిలో మంటలు చెలరేగాయని స్థానిక యంత్రాంగం తెలిపింది. పంఝౌ నగర ప్రభుత్వం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ప్రకటన ప్రకారం, గనిలోని కన్వేయర్ బెల్ట్‌కు మంటలు అంటుకోవడంతో మరణించిన వారు చిక్కుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేసే చైనా, దాని పవన, సౌర విద్యుత్ సామర్థ్యాన్ని భారీగా విస్తరించినప్పటికీ విద్యుత్ కోసం బొగ్గుపై ఎక్కువగా ఆధారపడి ఉంది. దేశంలోని బొగ్గు గనుల పరిశ్రమ ఇటీవలి సంవత్సరాలలో కార్మికులకు భద్రతా పరిస్థితులను మెరుగుపరిచింది. అయితే అలాంటి ప్రమాదాల వల్ల మరణాలు ఇప్పటికీ సంభవిస్తున్నాయి.
ఆదివారం చైనాలోని బొగ్గు గనిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ గని రాజధాని బీజింగ్‌కు నైరుతి దిశలో 3,600 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంఝౌ నగరంలో ఉంది. బొగ్గు గనిలో మంటల కారణంగా కనీసం 16 మంది మరణించారని స్థానిక అధికారులు తెలిపారు. మంటలను ఆర్పివేశామని ప్రభుత్వం తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన నోటీసులో పేర్కొంది. కన్వేయర్ బెల్ట్‌లో మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో తేలింది. చైనాలో మైనింగ్ రంగంలో భద్రత ఇటీవలి దశాబ్దాలలో మెరుగుపడినప్పటికీ, ప్రమాదాలు ఇప్పటికీ పరిశ్రమను తరచుగా పీడిస్తున్నాయి. సేఫ్టీ ప్రోటోకాల్స్‌లో అలసత్వం కారణంగా ఈ ప్రమాదాలు తరచుగా జరుగుతాయి. ఫిబ్రవరిలో, ఉత్తర ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో ఒక బొగ్గు గని కూలిపోయి, డజన్ల కొద్దీ ప్రజలు, వాహనాలను శిధిలాల కింద సమాధి అయ్యాయి. 53 మంది మరణించినట్లు జూన్‌లోనే వెల్లడించిన అధికారులు.. తుది మరణాల సంఖ్యను మాత్రం వెల్లడించలేదు.