
More than 100 people died in Iraq Fire Accident Today: ఇరాక్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర నినెవే ప్రావిన్స్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరుగుతున్న పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 100 మందికి పైగా మరణించారు. మరోవైపు 150 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని అక్కడి స్థానిక అధికారులు, మీడియా వర్గాలు వెల్లడించాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది.