
Pakistan: పాకిస్తాన్‌లో బాంబు పేలుడు ధాటికి 8 మంది మరణించారు. రాకెట్ లాంచర్ మందుగుండుతో పిల్లలు ఆడుకుంటుండగా ఈ సంఘటన జరిగింది. సింధ్ ప్రావిన్సులో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన 8 మందిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు.
కాష్మోర్-కంద్‌కోట్ ఎస్ఎస్పీ రోహిల్ ఖోసా మాట్లాడుతూ.. పిల్లలు గ్రౌండ్ లో ఆగుకుంటుండగా, రాకెట్ లాంచర్ షెల్ దొరికింది. దాన్ని ఇంటికి తీసుకువచ్చి, దాంతో ఆడుకుంటుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించిందని, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పిల్లలు, ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తితో సహా 8 మంది మరణించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు పాక్ పోలీసులు తెలిపారు.
Read Also: S Jaishankar: “ఈ ప్రశ్న అడగాల్సింది నన్నుకాదు”.. నిజ్జర్ హత్యపై జైశంకర్..
కాష్మోర్ జిల్లా కంద్‌కోట్ తహసీల్ పరిధిలోని జాంగీ సబ్జ్వాయ్ గోత్ గ్రామంలో రాకెట్ లాంచర్ షెల్ ఎలా ఉందని సింధ్ ముఖ్యమంత్రి జస్టిస్ మక్బూల్ బకర్ అక్కడి పోలీస్ ఉన్నతాధికారులను నివేదిక కోరినట్లు డాన్ న్యూస్ నివేదించింది. ఈ ఘటనపై బకర్ విచారం వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతాలకు ఆయుధాలు ఎలా చేరాయని, ఏమైనా స్మగ్లింగ్ జరుగుతుందా..? అని అధికారులను ప్రశ్నించారు.