Leading News Portal in Telugu

World Cup 2023: ప్రపంచ కప్‌కు ముందు దక్షిణాఫ్రికాకు షాక్.. స్వదేశానికి కెప్టెన్ బావుమా


ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా తన దేశానికి తిరిగి వెళ్లాడు. మీడియా కథనాల ప్రకారం.. కుటుంబ కారణాల వల్ల బావుమా ఇంటికి తిరిగి వెళ్లాడని పేర్కొన్నాయి. అయితే ప్రపంచకప్కు ముందు దక్షిణాఫ్రికా.. సెప్టెంబర్ 29, అక్టోబర్ 2 న ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్‌లతో వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ టెంబా బావుమా అందుబాటులో ఉండడు.

అయితే మ్యాచ్ లు ప్రారంభానికి ముందు టెంబా బావుమా ఇండియాకు తిరిగి వస్తాడని టీమ్ మేనేజ్ మెంట్ చెబుతుంది. సౌతాఫ్రికా తొలి మ్యాచ్ శ్రీలంకతో జరుగనుంది. అక్టోబర్ 7న మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత అక్టోబర్ 12న రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. మరోవైపు టెంబా బావుమా కొన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవడంతో ఐదాన్ మార్క్రామ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.

ఇక దక్షిణాఫ్రికా తన మూడో మ్యాచ్‌ని నెదర్లాండ్స్‌తో ఆడనుంది. అక్టోబర్ 17న దక్షిణాఫ్రికా-నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా అక్టోబర్ 21న దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత దక్షిణాఫ్రికా జట్టు వరుసగా బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్, భారత్, అఫ్గానిస్థాన్‌లతో తలపడనుంది.