Leading News Portal in Telugu

Nuclear submarine : ప్రమాదానికి గురైన న్యూక్లియర్ సబ్‌మెరైన్.. 55 మంది మృతి


Chinese Submarine News: చైనా అణు జలాంతర్గాములు వరుసగా ప్రమాదానికి గురవుతున్నాయి. ఆగస్టు 21 ఓ చైనా అణు జలాంతర్గామి ప్రమాదానికి గురైంది. కాగా తాజాగా మరో అణు జలాంతర్గామి కూడా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. వివరాలలోకి వెళ్తే బ్రిటిష్ వార్తాపత్రిక డైలీ మెయిల్ నివేదిక ప్రకారం.. పసుపు సముద్రంలో బ్రిటిష్ నౌకలను ట్రాప్ చేయడానికి చైనా న్యూక్లియర్ సబ్‌మెరైన్ న్ను ఏర్పాటు చేసింది. కాగా ఈ న్యూక్లియర్ సబ్‌మెరైన్ లో ఆక్సిజన్ వ్యవస్థ లో సంభవించిన వైఫల్యాల కారణంగా న్యూక్లియర్ సబ్‌మెరైన్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ)కి చెందిన 55 మంది నావికులు మరణించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

Read also:Coconut juice : కొబ్బరి జ్యూస్ తయారీ విధానం.. ఉపయోగాలు

కాగా.. UK రహస్య నివేదిక ప్రకారం గతంలో కూడా ఇలానే ఓ న్యూక్లియర్ సబ్‌మెరైన్ లోని ఆక్సిజన్ వ్యవస్థ లో సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో నౌకాదళ సిబ్బందిలో మొదటగా ఒకరు మరణించారు. అనంతరం అందులోని సిబ్బంది విష జ్వరాల బారిన పడ్డారు. మృతుల్లో చైనా పీఎల్‌ఏ నేవీ సబ్‌మెరైన్ ‘093-417’ కెప్టెన్‌తో పాటు మరో 21 మంది అధికారులు కూడా ఉన్నారని నివేదిక పేర్కొన్నది. కానీ చైనా మాత్రం అధికారికంగా ఇప్పటికి ఈ రెండు ప్రమాదలను అధికారికముగా ప్రకటించలేదు. అలానే ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదంటూ ఖండించింది. దెబ్బతిన్న జలాంతర్గామి కోసం అంతర్జాతీయ సహాయం అభ్యర్ధించడానికి కూడా చైనా నిరాకరించిందని UK రహస్య నివేదికల సమాచారం.