US: వేధిస్తున్నారంటూ మహిళలు కేసు పెడితే వేధింపుల కేసులో జైలుకు వెళ్లిన పురుషులు ఉన్నారు. బస్టాప్ లో అమ్మాయిలని ఏడిపిస్తూ పోలీసుల చేతికి చిక్కి బడితపూజ చేయించుకున్న అబ్బాయిలు ఉన్నారు. ఆడవారికి అన్యాయం జరిగితే గోల చేసి గగ్గోలుపెట్టే సమాజం పురుషులకి అన్యాయం జరిగితే అసలు పట్టించుకోదు ఎందుకు? అనే ప్రశ్న ప్రతి ఒక్క అబ్బాయికి వచ్చే ఉంటుంది. అయితే తాజాగా ఓ వార్త వెలుగు చూసింది. 16 మంది అబ్బాయిల్ని వేధించినందుకు ఓ వ్యక్తికి జైలు శిక్ష పడింది అది కూడా ఒకటో రెండో సంవత్సరాలు కాదు. ఏకంగా 690 సంవత్సరాలు. ఈ విచిత్ర ఘటన USలో చోటు చేసుకుంది.
Read also:Elon Musk: ఫలించని ఎలాన్ మస్క్ నిర్ణయాలు.. రోజురోజుకు క్షీణిస్తున్న ట్విటర్ ఆదాయం
వివరాలలోకి వెళ్తే.. దక్షిణ కాలిఫోర్నియాలో చాల మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలని చూసుకునేందుకు మాథ్యూ జక్ర్‌జెవ్‌స్కీ అనే వ్యక్తిని ఆయాగా నిర్మించంచారు. తమ పిల్లను ఓ సంరక్షకుని నీడలో పెంచుతున్నాం అనుకున్నారు తల్లిదండ్రులు. కానీ ఓ రాక్షసుడి చేతిలో పిల్లలని పెడుతున్నాం అని తెలుసుకోలేక పోయారు. తల్లిదండ్రులు అతన్ని విశ్వసించారు. ఇదే అదునుగా అతను మైనర్ అబ్బాయిలని వేధించడం ప్రారంభించారు 16 సంవత్సరాలు మరియు అంతకంటే తక్కువ వయసున్న అబ్బాయిలకి అస్లీల వీడియోలు చూపించడం.. వారితో అసభ్యకరంగా ప్రవర్తించడం చేశారు. పిల్లలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకి చెప్పగా.. తల్లిదండ్రులు అతని పైన కేసుపెట్టారు. ఈ కేసులో ఆ ఆయాని నిందితుడుగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో అతనికి 690 ఏళ్ల యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉంది. కాగా మొత్తం 34 కేసుల్లో అతను నిందితుడుగా ఉన్నాడు.