Leading News Portal in Telugu

Abhishek Singh: ఐఏఎస్‌ ఉద్యోగానికి రాజీనామా.. కారణం ఇదేనా..?


Delhi: మనకి ఏ రంగం పైన అయిన ఆసక్తి ఉండొచ్చు. కానీ.. మనం చేస్తున్న పనిని గౌరవించాలి. పనిని సక్రమంగా చెయ్యాలి. అలా చెయ్యకపోతే ఇలానే జరుగుతుంది. ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా.? సినిమాల పైన ఇష్టంతో ఐఏఎస్‌ ఉద్యోగం పోగొట్టుకున్నాడు ఓ వ్యక్తి. వివరాలలోకి వెళ్తే.. ఉత్తర్‌ప్రదేశ్‌ కేడర్‌కు చెందిన 2011 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అభిషేక్‌ సింగ్‌కు సినిమాల పైన మక్కువ ఎక్కువ. ఆ ఇష్టం ఆయన్ని సినిమాలు చూసేలా కాదు ఆయనే సినిమాలు చేసేలా ప్రేరేపించింది. ఈ నేపథ్యంలో కొన్ని వివాదాలు కూడా ఆయన్ని చుట్టుముట్టాయి. కాగా 2015 సంవత్సరంలో డిప్యుటేషనుపై యూపీ నుంచి ఢిల్లీ వెళ్లారు. ఈ నేపధ్యంలో 2018సంవత్సరంలో వ్యవధిని మరో రెండేళ్లు పెంచారు అతని పై అధికారులు. దీనితో మెడికల్‌ లీవ్‌ తీసుకున్నారు అభిషేక్‌ సింగ్‌. దీనితో 2020 మార్చిలో ఆయన్ను సొంత రాష్ట్రానికి బదిలీ చేసింది ప్రభుత్వం.

Read also:Harassment: అబ్బాయిలను వేధించినందుకు 690ఏళ్ల జైలు శిక్ష..

అయిన అభిషేక్ వెంటనే విధుల్లో చేరకపోగా సైరైన కారణం కూడా చెప్పలేదు. బదిలీ అయిన 3 నెలల తర్వాత విధుల్లో చేరారు. ఇది ఇలా ఉంటె గత సంవత్సరం గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడిగా అభిషేక్ ని నియమించారు. ఈ క్రమంలో తనే పరిశీలకుడినని తెలుపుతూ ఓ ఫోటో ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ కారణంగా ఎన్నికల విధుల నుంచి తప్పించింది ఈసీ. అనంతరం విధుల్లో నిర్లక్ష్యాన్ని చూపిస్తుందుకుగాను అభిషేక్‌ సస్పెండ్‌ అయ్యారు. కాగా అతని భార్య కూడా ఐఏఎస్‌ అధికారిగా విధులను నిర్వహిస్తుంది. కాగా అభిషేక్ కి ఇంస్టాగ్రామ్లో 50 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.