Leading News Portal in Telugu

Kenya: కెన్యాను కుదిపేస్తున్న మాయదారి రోగం.. 100 మంది బాలికలకు అనారోగ్యం..


Kenya: ఆఫ్రికా దేశం కెన్యాను మాయదారి రోగం కలవరపెడుతోంది. అసలు ఏ వ్యాధి కారణంగా బాలికలు అనారోగ్యానికి గురవుతున్నారో వైద్యులకు స్పష్టంగా తెలియడం లేదు. కెన్యాలోని దాదాపుగా 100 మంది పాఠశాల బాలికలు ఆస్పత్రిలో చేరారు. అధికారులు వారి రక్తం, మూత్రం, మలం నమూనాలను నైరోబిలోని ప్రయోగశాలకు పంపారు.

మిస్టరీ అనారోగ్యం కారణంగా ఇప్పటి వరకు 100కు పైగా బాలికలు ఆస్పత్రుల్లో చేరారు. అనారోగ్యానికి ఖచ్చితమైన సమాచారం లేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. బీబీసీ కథనం ప్రకారం కాకమెగా పట్టణంలోని ఎరేగి బాలిక ఉన్నత పాఠశాల విద్యార్థులు తీవ్ర మోకాళ్ల నొప్పులతో, నడవడానికి ఇబ్బంది పడ్డారు. కాలు పక్షవాతానికి, మూర్చ వ్యాధులకు గురవుతున్నారని పేర్కొంది.

అయితే ఇది మాస్ హిస్టీరియా అని కొందరు అభిప్రాయపడుతున్నారు. బాలికలు నడవడానికి ఇబ్బందులు పడుతున్న ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. విద్యాశాఖ అధికారులు పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థులు తరగతులు యథావిధిగా కొనసాగుతున్నాయని చెప్పారు. బాలికలకు సంబంధించి శాంపిల్స్ రిపోర్ట్స్ వారం తరువాత వస్తాయని అధికారుల వెల్లడించారు.