Leading News Portal in Telugu

Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ ప్రకటన.. నార్వే రచయితకు అవార్డ్..


Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ ప్రకటించారు. నార్వేకు చెందిన రచయిత జోన్ ఫోస్సేకు 2023కి గానూ సాహిత్యంలో నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు. దాదాపుగా 40 ఏళ్లుగా జోన్ ఫోస్సే నవలలు, నాటకాలు, కవితలు, కథలు, వ్యాసాలు, పిల్లల పుస్తకాలు రాస్తున్నారు. అతను రచించిన రచనలు యాభైకి పైగా భాషల్లోకి అనువదించబడ్డాయి. నాటకాలు ప్రపంచవ్యాప్తంగా వెయ్యిసార్లు ప్రదర్శించబడ్డాయి.

ఫోస్సే రచించిన మొదటి నవల రెడ్, బ్లాక్ 1983లో తొలిసారి ప్రచురితమైంది. సాహిత్యంలో నోబెల్ బహుమతిని ప్రదానం చేయడం 1901 నుంచి మొదలైంది. ఇప్పటి వరకు 115 సార్లు 119 మందికి ఈ అవార్డును బహూకరించారు.